ప్రభుత్వ ఆదాయానికి గండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆదాయానికి గండి

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

ప్రభుత్వ ఆదాయానికి గండి

ఈ అక్రమ రవాణా ద్వారా ప్రతిరోజూ కనిగిరి నియోజకవర్గం నుంచి 5 నుంచి 8 భారీ లారీలు (సుమారు 320 టన్నుల) గ్రేడ్‌1 తెల్ల రాయి నిత్యం దేశం దాటి విదేశాలకు తరలిపోతోంది. ఈ లెక్కన రోజూ లక్షల రూపాయల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేవని, ఖజానా ఖాళీ అయిందని ఒకపక్క గగ్గోలు పెడుతుంటే, మరోపక్క ఆ పార్టీ నేతలే ఈ స్థాయిలో సహజ వనరులను దోచుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కనిగిరిలో రెచ్చిపోతున్న ఈ వైట్‌ క్వార్జ్ట్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే, రాబోయే తరాలకు మిగిలేది కేవలం రాళ్ల గుట్టలేనని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement