ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలపై నిరంతరం పోరాడుతుందని, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జగన్ 2.ఓ సూపర్ యాప్ వాల్ పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణంగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పోరాటాలపై, నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలపై వీడియోలు, ఆడియోలు, ఫొటోలు ఈ యాప్‌లో డౌన్ లోడ్ చేయవచ్చని, తద్వారా విస్తృతంగా ప్రచారం చేసే అస్త్రంగా ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ప్రతి పక్షం అంటే ప్రజల పక్షం నిలిచేదని, అటు వంటి స్థానంలో ఉన్న తమ పార్టీ 25 సమస్యలపై కార్యక్రమాలను చేపట్టిందని, పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి అనేక సమస్యలను పరిష్కరించిందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కకు నెట్టేసి దళారులకు నాయకత్వం వహిస్తోందని ఆయన విమర్శించారు. టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడి భూ కబ్జాలు, అక్రమంగా రేషన్, ఇసుక, మట్టి దందా చేస్తున్నారని అన్నారు. ఇటువంటి అన్యాయాలు, అక్రమాలపై జగన్ 2.ఓలో పోస్ట్ చేయవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండలాల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్, వివిధ విభాగాల నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, సూరె వెంకట రమేష్, సయ్యద్ జబీవుల్లా, ఐ.వి.సుబ్బారావు, వై.వెంకటేశ్వరరెడ్డి, శేషం రంగబాబు, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సంతోష్ కుమార్, ఎల్.రాములు, గార్లపాటి శార, పి.రాములు నాయక్, ఆర్.అరుబాయి, పల్లె సరళ, వాడాల పద్మ, షేక్ కాశింపీరా, షేక్.ఫయాజ్, జి.కృష్ణారావు, కాకుమాను సురేష్, కొండయ్య, నాగయ్య, మురారి గాలయ్య, కందూరి గురుప్రసాద్, ఎం.రాజశేఖర్, సురేష్ నాయక్, తిరుమలరెడ్డి చిన్న వీరారెడ్డి, వెంకట నారాయణ, గూడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో అరాచకాలపై ప్రశ్నిస్తున్న జగనన్న


