ఉద్రిక్తంగా హైవే దిగ్బంధనం.. పలువురిపై కేసులు | - | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా హైవే దిగ్బంధనం.. పలువురిపై కేసులు

Jul 19 2026 12:38 AM | Updated on Jul 19 2026 12:38 AM

ఉద్రిక్తంగా హైవే దిగ్బంధనం.. పలువురిపై కేసులు

బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులు

పోలీసుల తీరును నిరసిస్తూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి కోల్‌కత్తా–చైన్నె జాతీయ రహదారిపై బైఠాయించారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మరోసారి రంగ ప్రవేశం చేసిన పోలీసులు నాయకులను బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాకాణిని, బుర్రాలను పోలీసులు బలవంతంగా పక్కకి లాగిపడేశారు. అదేవిధంగా బుర్రాను లాక్కెళ్లే ప్రయత్నంలో పెద్ద ఎత్తున తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే రోడ్డుపై బైఠాయించిన మహిళా నేతలను లేడీ పోలీసులు పక్కకి లాగేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేసినందుకు వైఎస్సార్‌సీపీ నేతలపై గుడ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో పాటు కందుకూరు నాయకులు గణేశం గంగిరెడ్డి, షేక్‌ రఫి, బిళ్లా రమణయ్య, కాపులూరి మధుసూదన్‌యాదవ్‌, చేపల బాలాజీ, కాట్రగడ్డ వెంకట్రావ్‌, కావలి నియోజకవర్గానికి చెందిన కామరాజు తదితరులపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement