కన్నతండ్రులే కాలనాగులై.. | - | Sakshi
Sakshi News home page

కన్నతండ్రులే కాలనాగులై..

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తాళ్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన 13 ఏళ్ల కుమార్తైపె రెండు నెలలుగా 3 సార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో 20 రోజుల క్రితం బాలికకు బాగా కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఒంగోలు రిమ్స్‌కు వెళ్లారు. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు చేయగా బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ డి.దాసు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. నిందితుడు 15 ఏళ్ల క్రితం తన తండ్రి నిద్ర పోతుండగా కిరోసిన్‌ పోని నిప్పు పెట్టి హత్య చేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఆమేరకు అప్పట్లో కేసు కూడా నమోదైంది.

తాళ్లూరు/సింగరాయకొండ:

డబిడ్డలను కంటికి రెప్పలా కాపు కాయాల్సిన కన్నతండ్రులే కాలనాగులై వారి జీవితాలపై విషం చిమ్ముతున్నారు. వావివరుసలు మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. జిల్లాలో ఆదివారం వెలుగుచూసిన రెండు ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒకడు మద్యం మత్తులో కుమార్తైపె లైంగికదాడికి యత్నించగా, మరొకడు కుమార్తైపె పలుమార్లు లైంగికదాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే..

కన్న కూతురిపై తండ్రి లైంగికదాడి

కూతురిపై తండ్రి లైంగికదాడికి యత్నం

మద్యం మత్తులో కన్నకూతురిపై తండ్రి లైంగిక దాడికి యత్నించిన ఘటనపై ఆదివారం పోక్సో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతుల కుమార్తె ఇంటర్మీడియెట్‌ చదువుతూ సెలవులకు ఇంటికి వచ్చింది. ఈక్రమంలో తండ్రి మద్యం మత్తులో ఈనెల 4వ తేదీన కుమార్తైపె లైంగికదాడికి యత్నించాడు. ఆ విషయాన్ని కుమార్తె తల్లికి చెప్పడంతో ఆమె భర్తను నిలదీసింది. అయితే ఈవిషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించడంతో ఊరుకున్నారు. ఆదివారం మేనమామకు వారు ఫోన్‌ ద్వారా చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బీ మహేంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement