మృత్యుఘోష..! | - | Sakshi
Sakshi News home page

మృత్యుఘోష..!

Jan 2 2026 12:21 PM | Updated on Jan 2 2026 12:21 PM

మృత్య

మృత్యుఘోష..!

మూగ జీవాల

కనిగిరిరూరల్‌:

జిల్లాలో అత్యధికంగా పశు సంపద ఉండే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. వ్యవసాయం కంటే పశు ఆధారిత కుటుంబాలే అధికం. ఏ పల్లె చూసినా ప్రతి ఇంట్లో కనీసం ఒక గేదే.. రెండు గొర్రెలు, లేదా మేక పిల్లలు ఉంటాయి. అయితే ప్రస్తుతం పశ్చిమాన మూగ జీవాలు మృత్యు ఘోష పెడుతున్నాయి. సీజనల్‌ వ్యాధులు, వింత రోగాలతో జబ్బులు సోకి మృతువాత పడుతుండటంతో పశు పోషకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లుతుండటంతో లబోదిబోమంటున్నారు.

మందులెక్కడ..?

బాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పశుసంవర్ధక శాఖను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఒకట్రెండు రకాల మందులు, నట్టల నివారణ మందులు తప్ప మిగిలిన మందులు ఇవ్వడం లేదు. దీంతో గొర్రెల కాపరులు వేల రూపాయలు వెచ్చింది ఖరీదైన మందులు ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొన్ని జీవాలు తట్టుకుంటున్నా సకాలంలో వైద్యం అందక కొన్ని జీవాలు మృత్యువాతపడుతున్నాయి.

వైద్యులు కరువే..

జిల్లాలోని 36 మండలాల్లో 84 పశు వైద్య శాలలు, 55 గ్రామీణ పశు వైద్య శాలలున్నాయి. కనిగిరి నియోజవర్గంలోని ఆరు మండలాల్లోని 135 పంచాయతీల్లో 3 ఏడీహెచ్‌ కార్యాలయాలు ఉన్నాయి.పశువైద్య 3 ఏడీహెచ్‌ పాయింట్లు ఉన్నాయి. కనిగిరి ఏడీహెచ్‌ పరిధిలోని రెండు మండలాల్లో నాలుగు పశు వైద్య శాలలు, సీఎస్‌పురం ఏడీహెచ్‌ పరిధిలో నాల్గు పశువైద్యశాలలు, హెచ్‌ఎంపాడు ఏడీహెచ్‌ పరిధిలో రెండు నాలుగు పశు వైద్యశాలు, ఒక ఆర్‌ఎల్‌వీ పాయింట్లు ఉన్నాయి. తాజాగా మార్కాపురం జిల్లా, పాత పశ్చిమ ప్రకాశంలోని నాల్గు నియోజకవర్గాల్లో కనిగిరి, సీఎస్‌పురం, హెచ్‌ఎంపాడు, వై పాలెం, త్రిపురాంతకం, మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, పొదిలి, గిద్దలూరులలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులున్నాయి. కానీ కనిగిరి ఆరు మండలాల్లో ఏడీహెచ్‌ పోస్టులు భర్తీగా ఉన్నా.. మిగతా చోట్ల వైద్యులు లేరు. వెలిగండ్ల మండలంలోని రెండు వైద్యశాలల్లో డాక్టర్లు లేరు. హెచ్‌ఎంపాడులో రెండు వైద్యశాలల్లో డాక్టర్లు లేరు. కనిగిరి మండలంలోని రెండు వైద్యశాలలకు ఒక్కరే ఉన్నారు. పీసీపల్లిలో రెండు వైద్యశాలలకు ఒక్కరే, సీఎస్‌పురంలో రెండు వైద్యశాలలకు ఒక్కరే, అంబవరం వైద్యశాలలో కనీసం అటెండర్‌ కూడా లేదు. ఇన్‌చార్జిల పాలనతో వైద్యం అందని ద్రాక్షలా మారింది.

వ్యాధులతో పశుపోషకుల బెంబేలు..

చలికాలంలో జీవాలకు సీజనల్‌ వ్యాధులు విపరీతంగా సోకుతున్నాయి. గొర్రెలు, మేకలకు పీపీఆర్‌( పారుడు) వ్యాధి, ఆర్స్‌ వ్యాధి, మసూచి, చిటుకు, నోటి జబ్బు, కాళ్లకు పండ్లు, కళ్ల మసక ఇలా అనేక రోగాలతో గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతున్నాయి. ప్రధానంగా గొర్రెలు ఎక్కువగా చనిపోతున్నాయి. ఈ వ్యాధికార సూక్ష్మ జీవులు శరీరంపై వాలడం వల్ల జీవాలకు వచ్చి వ్యాధులు మరొకరికి సోకుతున్నాయి. దీంతో గొర్రెల కాపరులు రెండు మూడు దొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. తల్లి నుంచి బిడ్డను కూడా వేరు చేసి పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. గడిచిన నెల రోజుల్లో ఆరు మండలాల్లో 300లకు పైగా గొర్రెలు చనిపోయినట్లు గొర్రెల కాపరులు వాపోతున్నారు. ఒక్క చాకిరాలలోనే మూడు దొడ్లలతో 20కి పైగా గొర్రెలు చనిపోగా.. మరో 30కి పైగా వ్యాధుల బారిన పడినట్లు కాపరులు తెలిపారు. కనిగిరి, హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం, పీసీపల్లి, వెలిగండ్ల, పామూరు మండలాల్లో అనేక చోట్ల గొర్రెలు, మేకలు సీజనల్‌ వ్యాధులతో నేలపట్టి ఉన్నాయి.

రైతు సేవా కేంద్రాల్లో మందులు నిల్‌:

చంద్రబాబు సర్కార్‌లో పశు వైద్య శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గుర్యయింది. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గొర్రెల, పశు కాపరులకు సంబంధించి ఒక్క మందు ఇవ్వలేదు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ ఉంటారు. అయితే తొలకరి సమయంలో అక్కడ డీ వార్మింగ్‌( నట్టల నివారణ మందులు) టీకాలు తప్ప మిగిలిన మందులు లేవు. మండల కేంద్రాల్లో ఉన్న ఏడీహెచ్‌ పాయింట్లలో, పశు వైద్య శాలల్లో కూడా అరకొర మందులు సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన మందులు సక్రమంగా లేవు.

గత వైఎస్సార్‌ సీపీ హయాంలో..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పశు పోషణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మందుల కొరత లేకుండా చేశారు. తమ జీవాలకు రోగాలు వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాలకు పరిగెత్తకుండా రైతు సేవా కేంద్రాల్లో మందులను, సీజనల్‌ వ్యాధుల టీకాలను అందుబాటులో ఉంచారు. రైతు సేవా కేంద్రాల్లో వెటర్నరీ అసిస్టెంట్‌ల చేత తక్షణం వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. 1962 ద్వారా సంచార అంబులెన్స్‌ పశువైద్య సేవలను ఫోన్‌ ద్వార ప్రజలకు అందించారు.

రోగాలతో మృతి చెందుతున్న

గొర్రెలు, మేకలు

జీవాలను కాపాడుకునేందుకు

కాపరులు తంటాలు

రైతు సేవా కేంద్రాల్లో మందులు నిల్‌..

వేధిస్తున్న వైద్యుల కొరత

మూగజీవాలు మృత్యు ఘోష

పెడుతున్నాయి. అంతు పట్టని రోగాలతో నేలకొరుగుతుండటంతో పశుపోషకులు అల్లాడిపోతున్నారు. కళ్ల ముందే జీవాలు మృత్యువాత పట్టడాన్ని పశుపోషకులు

జీర్ణించుకోలేకపోతున్నారు.

పశువైద్యశాలల్లో వైద్యుల కొరత..

మందుల కొరతతో పశుపోషకుల కష్టాలు చెప్పేవీ కావు.

మృత్యుఘోష..! 1
1/6

మృత్యుఘోష..!

మృత్యుఘోష..! 2
2/6

మృత్యుఘోష..!

మృత్యుఘోష..! 3
3/6

మృత్యుఘోష..!

మృత్యుఘోష..! 4
4/6

మృత్యుఘోష..!

మృత్యుఘోష..! 5
5/6

మృత్యుఘోష..!

మృత్యుఘోష..! 6
6/6

మృత్యుఘోష..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement