కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించాలి
ఒంగోలు టౌన్: గత ఏడాది సాధించిన దానికన్నా కొత్త సంవత్సంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేక్ కట్ చేసి పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమష్టి కృషితో ప్రజలకు మెరుగైన సేవలందించాలని చెప్పారు. వివిధ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితులకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలన్నారు. సమాజానికి గొప్ప సేవలందించే అవకాశం పోలీసు ఉద్యోగులకు ఎక్కువగా ఉంటుందని, ప్రజలకు మేలు చేకూర్చి వారి అభిమానాన్ని పొందాలని చెప్పారు. జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా పనిచేయాలన్నారు. ఏవైనా సమస్యలు, సూచనలు ఉంటే తన దృష్టికి తీసుకొనిరావాలన్నారు.
డీటీసీని సందర్శించిన ఎస్పీ ...
పోలీసు కానిస్టేబుల్ శిక్షణ జీవితాన్ని మేలుమలుపు తిప్పాలని, అందుకనుగుణంగా క్రమశిక్షణతో కానిస్టేబుల్ శిక్షణ పొందాలని ఎస్పీ సూచించారు. శిక్షణ సమయంలో గాయాలు కలగకుండా అప్రమత్తంగా వుండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సానుకూల ఆలోచనలతో ముందడుగు వేయాలని చెప్పారు. తల్లిదండ్రుల ఆశయాలతో పాటుగా ఉన్నత శిఖరాలను చేరాలన్న మీ ఆశలను నెరవేర్చుకోవాలన్నారు. డీటీసీలో కేక్ కట్ చేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. జిల్లాలోని డిఎస్పీలు, సీఐలు, ఆర్‌లు, ఎస్సైలు పాల్గొన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో
ఎస్పీ హర్షవర్థన్ రాజు


