మిర్చి క్లస్టరు హామీ ఏమైంది
మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో మిర్చిని అమ్మాలంటే అనేక వ్యయప్రయాసలకోర్చి గుంటూరుకు వెళ్లి అమ్ముకుంటున్నాం. ఈ ఏడాది మిర్చి ధరలు పూర్తిగా పడిపోయాయి. గత ఏడాది నవంబరులో క్వింటా రూ.18 వేలు ఉండగా జనవరి నుంచి అనూహ్యంగా మిర్చి ధర రూ.13 నుంచి రూ.14 వేలకు పడిపోయి ప్రస్తుతం క్వింటా రూ.8 వేలు కూడా పలకడం లేదు. నేను మూడున్నర ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. రూ.5 లక్షల పెట్టుబడి ఖర్చులు కాగా మరో రూ.5 లక్షలు అదనపు ఖర్చులు వచ్చాయి. క్వింటా మిర్చి రూ.8 వేలు ధర పలకడంతో వచ్చిన డబ్బులన్నీ కూలీలు, ఇతరత్రా ఖర్చులకే సరిపోయాయి. 2023 లో మిర్చి ధర రూ.22 వేలు పైగా ఉంది.
– జగన్, మిర్చి రైతు, ఓబాయపల్లి, తర్లుపాడు మండలం


