క్రీస్తు పుట్టుక లోకానికి వెలుగు
నాగులుప్పలపాడు: క్రీస్తు పుట్టుక సర్వ మానవాళికి శాంతి, సహనం అందించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున అన్నారు. పార్టీ మేధావుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కంచర్ల సుధాకర్ ఆధ్వర్యంలో అమ్మనబ్రోలు గ్రామంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మేరుగు నాగార్జున క్రీస్తు జననం ఆవశ్యకత తెలియజేశారు. అనంతరం చర్చి సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలడుగు రాజీవ్, ఓబుల్ రెడ్డి, కోయి హనుమయ్య, బాలకృష్ణ, బత్తుల ప్రసన్న, కొండయ్య, జెట్టి శ్రీనివాసరావు, హరిప్రసాద్, తదితరులు ఉన్నారు.


