ప్రణవికి పతకాలు | - | Sakshi
Sakshi News home page

ప్రణవికి పతకాలు

Dec 24 2025 4:20 AM | Updated on Dec 24 2025 4:20 AM

ప్రణవికి పతకాలు

ప్రణవికి పతకాలు

జాతీయ స్థాయి పిస్టల్‌ షూటింగ్‌లో

కొత్తపట్నం: ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ పిస్టల్‌ షూటింగ్‌లో కొత్తపట్నం మండలం రంగాయపాలెం పంచాయతీ వలసపాలెం గ్రామానికి చెందిన ద్వారం ప్రణవి రెండు పతకాలు సాధించింది. ఈ నెల 11 నుంచి వచ్చే నెల 4 వరకు ఢిల్లీలో నిర్వహించే 68వ జాతీయ స్థాయి 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ జూనియర్‌ విభాగంలో వెండి పతకం, సివిలియన్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా ద్వారం ప్రణవిని రాష్ట్ర రైఫిల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి డి.రాజకుమార్‌, ఒలింపిక్‌ మెడలిస్ట్‌ గగన్‌ నారంగ్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement