మెడికల్ కళాశాలపై పచ్చపడగ...
వెనకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఇది గమనించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్యతో పాటు పశ్చిమ ప్రజలకు వైద్య చికిత్స అందించే లక్ష్యంతో మార్కాపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రాయవరం వద్ద 41.97 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.475 కోట్లు మంజూరు చేసి 75 శాతం పనులు పూర్తి చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాల ప్రారంభించాలని భావించారు. ఊహించని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణాన్ని నిలిపివేసింది. అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని బదిలీ చేసింది. దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తోంది.


