
వివరాలు వెల్లడిస్తున్న జగన్నాథరావు
ఒంగోలు సెంట్రల్: ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు నేటి నుంచి నాలుగు రోజుల పాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి జగన్నాథరావు తెలిపారు. 5వ తేదీ వరకు మార్కాపురం, దోర్నాల, యర్రగొండపాలెం మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారి జీవన స్థితిగతులు, అభివృద్ధికి అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకోనున్నట్లు చెప్పారు. 4వ తేదీ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు మార్కాపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో చైర్మన్ అందుబాటులో ఉంటారని చెప్పారు. గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు హాజరై సమస్యలు తెలియజేయాలని సూచించారు.