ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం.. మృతదేహం దొరికితే కాల్చేయాలని

Government teacher commits suicide - Sakshi

ప్రకాశం: స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న గణిత ఉపాధ్యాయుడు రాజారపు లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన ఓ లేఖ సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం సంచలనం రేపింది. తనకు డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవడం, మరో వైపు అప్పులిచ్చిన వ్యక్తులు వెంటాడటంతో మార్కాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మృతదేహం దొరికితే కాల్చివేయాలని లేఖ రాసి స్నేహితుల గ్రూపులో సోమవారం వేకువజామున పోస్టు చేశాడు. తన ఫొటో, మాస్టర్‌ కార్డు, ముఖ్యమైన వారి ఫోన్‌ నంబర్లు, సూసైడ్‌నోట్‌, చెప్పులు చెరువు గట్టుపై ఆకుపచ్చ సంచిలో ఉంచుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.

కాగా ఉదయం 7 గంటలకు లేఖను చూసిన పలువురు పోలీసులకు సమాచారం అందించి చెరువు కట్ట దగ్గరకు వెళ్లారు. అక్కడ చెప్పులు, సంచి లభ్యమయ్యాయి. ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. సమీపంలోని ప్రాంతాలను జల్లెడ పట్టగా డ్రైవర్స్‌ కాలనీ వద్ద లక్ష్మయ్య ఆచూకీ లభించిందని సీఐ భీమానాయక్‌ తెలిపారు. తన ఇంటికి చేర్చి సైలెన్‌ బాటిల్‌ ఎక్కించి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు సీఐ తెలిపారు.

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top