టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.. ఇదే రిపీట్‌ అవుతుంది: టీజేఆర్ | YSRCP TJR Sudhakar Babu Serious Warning To TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.. ఇదే రిపీట్‌ అవుతుంది: టీజేఆర్

Feb 17 2025 12:56 PM | Updated on Feb 17 2025 1:28 PM

YSRCP TJR Sudhakar Babu Serious Warning To TDP Leaders

సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై కేసులు పెట్టి బెదిరించారని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల​్‌ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకం చేశారు. మా పార్టీ కౌన్సిలర్లపై కేసులు పెట్టించి బెదిరించారు. కిడ్నాప్ చేసి తమవైపు లాక్కున్నారు. మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులన్నీ వైఎ‍స్సార్‌సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్‌ చైర్మన్‌గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.

అధికారం ఉందనే అహంకారంతో పదవులను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి నేతలు నేర్పుతున్న పాఠాలు భవిష్యత్తులో అన్ని పార్టీలు అవలంభిస్తాయి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?. నెల్లూరులో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పోలీసులను అడ్డు పెట్టుకుని డిప్యూటీ మేయర్‌ను గెలిచారు. అసలు ఒక్క కౌన్సిలర్‌ని కూడా గెలవలేని టీడీపీ.. ఇప్పుడు వైస్ చైర్మన్‌లను గెలవాలని చూస్తోంది. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీ మారింది. దొడ్డిదారిలో పదవులు పొందటం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుంది?. ఇలా పదవులు పొందటం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి వారికి ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement