‘ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చ కుల మీడియా’

సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చకుల మీడియా అంటూ ట్వీట్ చేశారు. ‘‘విశ్వసనీయతను పూర్తిగా వదిలేసింది. జాతి నేతను లేపి నిల్చోబెట్టినా ప్రయోజనం ఉండదు. ప్రజాసేవలో ఉన్న మర్యాదస్తుల మీద కులపిచ్చితో విషం చిమ్ముతోంది. దస్పల్లా భూముల పేరుతో నీచపు రాతలు రాయించడం, రాయడం దాంట్లో భాగమే’’ అని విజయసాయిరెడ్డి ట్వీటర్‌లో మండిపడ్డారు.
ఆంధ్రకు పట్టిన గ్రహణం పచ్చ కుల మీడియా. విశ్వసనీయతను పూర్తిగా వదిలేసింది. జాతి నేతను లేపి నిల్చోబెట్టినా ప్రయోజనం ఉండదు. ప్రజా సేవలో ఉన్న మర్యాదస్తుల మీద కుల పిచ్చితో విషం చిమ్ముతోంది. దస్పల్లా భూముల పేరుతో నీచపు రాతలు రాయించడం, రాయడం దాంట్లో భాగమే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 3, 2022