
నెల్లూరు : మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై టీడీపీ శ్రేణులు చేసిన దాడిన ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అప్రజాస్వామికమని మండిపడ్డారు. విమర్శను తీసుకోలేని వారు రాజకీయ నాయకులా? అని ప్రశ్నించారు మిథున్‌రెడ్డి. ఈరోజు(మంగళవారం, జూలై 8వ తేదీ) ప్రసన్న కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు మిథున్‌రెడ్డి.
దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో ఏ వస్తువును వదిలిపెట్టలేదని,. ఈ విషయంలో పోలీస్ శాఖ స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. రెడ్ బుక్ ఇవాళ అమలైతే.. తాము కూడా ఓ బుక్ ఓపెన్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్‌రెడ్డికి తమ నాయకుడు వైఎస్ జగన్‌తో పాటు పార్టీ క్యాడర్ కూడా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.