‘40 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు’ | YSRCP MP Kotagiri Sridhar Comments Over TDP Amaravati Scam | Sakshi
Sakshi News home page

‘40 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు’

Sep 20 2020 4:10 PM | Updated on Sep 20 2020 4:23 PM

YSRCP MP Kotagiri Sridhar Comments Over TDP Amaravati Scam - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ముందే టీడీపీ నేతలు నాలుగు వేల ఎకరాలకు అగ్రిమెంట్‌ చేసుకున్నారని, 40 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. ఆ కుంభకోణంపై వెంటనే సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నేతలు, సుప్రీంకోర్టు జడ్జిలు సైతం భూములు పొందారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి కోర్టులు అడ్డుపడుతున్నాయి. ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తున్నాయి. గతంలో వైఎస్సార్ సీపీ ఎంపీలను ముగ్గుర్ని తీసుకుంటే ఇప్పుడు టీడీపీకి ముగ్గురే మిగిలారు. ( ‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌’)

రఘురామకృష్ణం రాజును తీసుకున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ మాత్రమే మిగులుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో రాష్ట్రమంతా మాకు మంచి మర్యాద ఉంది. వచ్చే ఎన్నికల్లో 151 మించి సీట్లు గెలుచుకుంటాం. ప్రతి మతం, కులం కోసం మేము పోరాడుతాం’’ అన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement