‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌’ | TDP MLA Maddali Giridhar Slams Chandrababu Over Silver Lion Idols Issue | Sakshi
Sakshi News home page

‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌’

Sep 20 2020 2:27 PM | Updated on Apr 14 2022 1:17 PM

TDP MLA Maddali Giridhar Slams Chandrababu Over Silver Lion Idols Issue - Sakshi

టీడీపీ హయాంలో విజయవాడలో 41 ఆలయాలను కూల్చారు. ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా? గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంద్రబాబు బలి తీసుకున్నారు.

సాక్షి, గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాళ్లు. చంద్రబాబుకు దేవుడంటే అసలు నమ్మకం లేదు. ఆయన రాష్ట్రంలో కుల, మతాలను రెచ్చగొడుతున్నారు. టీడీపీ హయాంలో విజయవాడలో 41 ఆలయాలను కూల్చారు. ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా? గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంద్రబాబు బలి తీసుకున్నారు.

ఎక్కడో చిన్న తప్పిదం జరిగితే దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లుతున్నారు. బుద్ధా వెంకన్న సైకిల్‌ బెల్‌లను దొంగతనాలు చేసేవాడు. ఆయనో బుద్ధిలేని వ్యక్తి. మంత్రి వెలంపల్లి నివాసంలో వెండి సింహాలు ఉన్నాయనటం దారుణం. మంత్రి వ‍్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వెండి రథానికి నాలుగు అడుగుల దూరంలో బుద్ధా వెంకన్న ఇల్లు ఉంది. ఈ కేసులో బుద్ధా వెంకన్నను విచారణ చేయాలి.’ అని ఎమ్మెల్యే గిరిధర్‌ డిమాండ్‌ చేశారు.
(చదవండి: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి)
(చదవండి: చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం)

Advertisement
 
Advertisement
Advertisement