‘చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి... మోసపు మహారాజు’ | YSRCP Leader TJR Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి... మోసపు మహారాజు’

Jun 29 2025 6:58 PM | Updated on Jun 29 2025 7:15 PM

YSRCP Leader TJR Slams Chandrababu

తాడేపల్లి :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సల్‌ రాష్ట్ర అధ్యక్షడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మండిపడ్డారు. మోసపూరిత, దగాకోరు రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్‌.. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబన్నారు.

తనకున్న మీడియా బలంతో లేనిది ఉన్నటల చూపించడంలో సమర్ధడు చంద్రబాబు అంటూ విమర్శించారు. ఎన్టీఆర్‌ నుంచి టీడీపీని కబ్జా చేసి.. నందమూరి వారసులను తొక్కేశారని, చంద్రబాబు ఓ కబ్జా నాయకుడని ఆరోపించారు. ‘ చంద్రబాబు అబద్ధాల చక్రవర్తి...మోసపు మహారాజు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని అబద్ధాలతోనే గడిపేశాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను పవిత్రగ్రంధంగా భావించిన వ్యక్తి జగన్. ఇచ్చిన ప్రతీ హామీని జగన్ నెరవేర్చారు. 

ప్రజలను వంచించి ..అబద్ధాలతో ఓట్లను కొల్లగొట్టడంలో చంద్రబాబు పీహెచ్.డీ చేశాడు. ఏం చెప్పుకుని తొలి అడుగు...ఇంటింటికీ తెలుగుదేశం చేపడతారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు మురికి మాటలు మానుకోవాలి. 24 గంటలూ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి సిగ్గులేదా మీకు. వివేకానందరెడ్డి హత్య ఎవరి హయాంలో జరిగింది...ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు?, వివేకా కేసులో ఎఫ్ఐఆర్ లో ఏముందో..ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీకు తెలియదా?, మీ ప్రభుత్వం వచ్చి ఏడాదైంది కదా...ఎందుకు సునీతకు న్యాయం చేయలేకపోయారు. 

 

కోడికత్తి కేసు అని అవహేళన చేస్తున్నారు. కోడికత్తి ఘటన జరిగింది నీ హయాంలోనే కదా?, ఆ కేసును ఏడాదైనా ఎందుకు నువ్వు పట్టించుకోలేదు. 40 ఏళ్ల అనుభవం, హైటెక్ సీఎం అని చెప్పుకునే నువ్వెందుకు పరిశీలించలేకపోయావ్?, జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో రాయితో దాడి జరిగింది నిజంకాదా?, ఆ ఘటన పై ఎఫ్ఐఆర్ నమోదైంది నిజం కాదా ... ఆ దోషుల సంగతి నువ్వే చూడు. డ్రామా ఆడించారో..నీ ఉపన్యాసాలతో ఆవేశానికి గురై రాయివేశాడో తేల్చు. సత్తెనపల్లి జగన్ పర్యటనలో గుర్తుతెలియని కారు ఢీకొట్టిందని మీ ఎస్పీనే చెప్పాడు. జగన్ పర్యటలను అడ్డుకోవడానికి ఏఐ టెక్నాలజీతో దొంగవీడియోను సృష్టించారు. జగన్ సత్తెనపల్లి పర్యటన పై బురదజల్లాలని చూస్తున్నారు. 

పొదిలి , సత్తెనపల్లి పర్యటలను చూసి చంద్రబాబు అండ్ కోకు చెమటలు పడుతున్నాయి. ఏడాదికాలంలోనే ఉప్పెనలా వ్యతిరేకత రావడంతో నేరారోపణలు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడా...చంపేశారా తేల్చండి. మీ హయాంలోనే కదా పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు...ఎందుకు ఈరోజు వరకూ తేల్చలేకపోయారు. క్రిస్టియన్ సమాజాన్ని దారుణంగా అవమానించింది మీరు కాదా?, ఈరోజుకీ ప్రవీణ్ కుటుంబాన్ని బయటకు రాకుండా చేస్తుంది మీరుకాదా?, తిరుపతి లడ్డూ వివాదం సృష్టించింది ఎవరు?, దేవదేవుడిని అవమాన పరిచింది మీరు కాదా?, సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగజార్చింది నువ్వుకాదా చంద్రబాబు’ అని ప్రశ్నించారు. 

టీజే సుధాకర్‌ ఇంకా ఏమన్నారంటే..

  • చంద్రబాబు వెంకటేశ్వరస్వామితో ఆడుకున్నావ్

  • ఈ పాపం నిన్ను ...నీ పిల్లలను ..వారి తరాన్ని కచ్చితంగా వెంటాడుతుంది

  • వేంకటేశ్వరస్వామి అన్నా...హైందవ సమాజం మనోభావాలన్నా ఏమాత్రం గౌరవం లేదు

  • చంద్రబాబు, పవన్ కలిసి తిరుమలను రాజకీయంగా వాడుకున్నారు

  • స్థానికసంస్థల ఎన్నికల్లో హీనాతిహీనంగా దిగజారిపోయారు

  • కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి...కొట్టి ...తప్పుడు కేసులు పెట్టించావ్

  •  వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అతి దారుణంగా నరికి చంపించారు

  • ఏడాది కాలంలో ఘోరాతి ఘోరంగా విఫలమయ్యావ్

  • వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం పై పదే పదే దాడులు చేయించావ్

  • మీరు చేసే కుళ్లు రాజకీయాలను మేం కచ్చితంగా గుర్తుంచుకుంటాం

  • జగన్ పర్యటన ఉంది...వేలాది మంది వస్తున్నారు...అంటే రక్షణ కల్పించావా

  • జగన్ మోహన్ రెడ్డి వాహనం పై దాడి జరిగే అవకాశముందని మేం చెప్పినా నువ్వు పట్టించుకోలేదు

  • సత్తెనపల్లి జగన్ పర్యటనలో దళితుడి మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

  • ప్రజలు నీకు 94 శాతం స్ట్రైక్ రేట్ ఇస్తే... నువ్వు 99 శాతం జనాన్ని ముంచేశావ్

  • ఈ ఏడాదికాలంలో నువ్వు చెప్పుకోవడానికి ఏముంది గుండు సున్నా తప్ప

  • 2014-19 మధ్య జరిగింది కూడా మోసపూరిత పాలనే

  • డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టారు

  • నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అన్నారు ఎగ్గొట్టేశారు

  • బాహుబలి గ్రాఫిక్స్ చూపించి రాజధానిలో శాశ్వతంగా చిన్న రోడ్డు నిర్మించలేదు

  • రియల్ ఎస్టేట్ కోసం రాజధాని నాటకం ఆడుతున్నారు

  • పోలవరం పూర్తిచేస్తానన్నావ్ ... ఎందుకు చేయలేకపోయావ్

  • విభజన హామీలన్నీ సాధించుకొచ్చేది నువ్వే అన్నావ్ కదా..ఏం చేశావ్

  • ఓటుకు నోటు కేసులో దొరికిపోయి తెలంగాణ నుంచి పారిపోయి వచ్చావ్

  • గోదావరి పుష్కరాల్లో 32 మందిని సినిమా షూటింగ్ పిచ్చితో చంపింది నువ్వు కాదా  

  • ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 చంద్రబాబు జేబు సంస్థలు

  • సమాజంలో అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడంలో సాక్షి మీడియాకు భాగస్వామ్యం ఉంది

  • నీతికి, నిజాయితీకి కట్టుబడి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచిని సాక్షి మీడియా ప్రజలకు తెలియజేస్తోంది  

  • జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని సాధించారు

  • జగన్ ఆర్బీకే సెంటర్లు తెచ్చాడు ...రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాడు

  • జగన్ పాలనలో ఏ పథకంలోనూ పక్షపాతం చూపలేదు 

  • ఈ ఏడాది కాలంలో నువ్వేం సాధించావో సమాధానం చెప్పు చంద్రబాబు  

  • జగన్ తెనాలి వెళ్లి యువకులను పరామర్శిస్తే గంజాయి బ్యాచ్ అని విమర్శిస్తున్నారు

  • మరో మారు తెనాలి యువకులను గంజాయి బ్యాచ్ అంటే చంద్రబాబు పై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా

  • ప్రకాశం జిల్లాలో ఏడు కేసులున్న ఓ రౌడీ షీటర్ చనిపోతే నువ్వు,నీ కుమారుడు వెళ్లారు

  • ఆయనే ఏ బ్యాచ్ .. అతని పైన సమాజంలో ఏమైనా క్లీన్ చిట్ ఉందా

  • నీ కార్యకర్త కాబట్టి ...నువ్వు పరామర్శించడానికి వెళ్లావ్...అతని పై ఎన్నికేసులు ఉన్నా పర్లేదా

  • అగ్రకులంలో పుట్టాడు కాబట్టి ఆయన గొప్పోడు..తెనాలి యువకులు మాత్రం రౌడీలా  

  • నీ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఈరోజు నేను పెట్టలేకపోవచ్చు

  • కానీ నాకంటూ ఒకరోజు వస్తుంది...అప్పుడు కచ్చితంగా బదులిస్తా

Advertisement
 
Advertisement
Advertisement