అబద్ధాల్లో చంద్రబాబు డబుల్‌ పీహెచ్‌డీ: సాకే శైలజానాథ్‌ | Ysrcp Leader Sake Sailajanath Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

అబద్ధాల్లో చంద్రబాబు డబుల్‌ పీహెచ్‌డీ: సాకే శైలజానాథ్‌

Mar 7 2025 5:35 PM | Updated on Mar 7 2025 6:44 PM

Ysrcp Leader Sake Sailajanath Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: అబద్దాలు చెప్పటంలో చంద్రబాబు డబుల్ పీహెచ్‌డీ చేశారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ దుయ్యబట్టారు. అధికారంలోకి రావటానికీ, వచ్చాక కూడా అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంకలాగ మారుతోందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి పదేపదే విష ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ఉన్నట్టు ప్రచారం చేశారు.. వాస్తవానికి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న అప్పులతో అల్లాడిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అప్పుల కేకలు పవన్ కళ్యాణ్‌కి వినపడటం లేదా?’’ అంటూ  శైలజానాథ్‌ ప్రశ్నించారు.

‘‘గవర్నర్ స్పీచ్‌లో కూడా అబద్దాలు చెప్పారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు అసెంబ్లీలో అప్పుల గురించి అడిగితే వాస్తవాలు బయట పడ్డాయి. ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏకంగా శ్రీలంకని మించి అప్పులు చేశారన్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి కూడా రూ.12 లక్షల అప్పు ఉందన్నారు. ప్రజలను మోసం చేయటానికి వీరంతా కలిసి వ్యవస్థీకృత నేరం చేశారు. అప్పటి జగన్ ప్రభుత్వంపై ఒక ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 9 నెలలకే లక్షా 47 వేల కోట్ల అప్పు చేశారు. ఈ తెచ్చిన అప్పంతా ఎవరికి ఇచ్చారు?’’ అంటూ శైలజానాథ్‌ నిలదీశారు.

‘‘ప్రజలకు ఇచ్చారా? పెద్దవాళ్లే పంచుకున్నారా?. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నిటినీ వెంటనే అమలు చేయాలి. అప్పులు తెచ్చి రాజధానిని కడుతున్నారు. అన్ని ప్రాంతాల ప్రజల సొమ్మును రాజధానిలో పెడుతున్నారు. కేంద్రం ఇస్తానన్న రూ.20 వేల కోట్లు తెచ్చి రాజధాని నిర్మాణం చేయాలి’’ అని సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు.

అబద్ధాలలో చంద్రబాబు  PHD చేశారు

Advertisement
 
Advertisement
Advertisement