జగన్‌ భరోసా: అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం | YS Jagan Guntur Tour Updates | Sakshi
Sakshi News home page

జగన్‌ భరోసా: అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

Sep 11 2024 8:35 AM | Updated on Sep 11 2024 3:35 PM

YS Jagan Guntur Tour Updates

మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గుంటూరులో పర్యటించనున్నారు.

గుంటూరు, సాక్షి: టీడీపీ అరాచకాలతో ఇబ్బందులు పడుతున్న పార్టీ నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల దాకా ప్రతీ ఒక్కరికీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేసిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు టీడీపీ గుండాల దాడిలో గాయపడ్డ పార్టీ నేత ఈది సాంబిరెడ్డిని జగన్‌ ఇవాళ పరామర్శించారు.

మూడేళ్ల కిందటినాటి మంగళగిరి టీడీపీ ఆఫీస్‌ దాడి కేసులో అక్రమంగా నందిగం సురేష్‌ను అరెస్ట్‌ చేయించింది కూటమి ప్రభుత్వం. రిమాండ్‌ కింద గుంటూరు సబ్‌ జైలులో ఉన్న సురేష్‌తో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌ అయ్యారు. సురేష్‌కు ధైర్యం చెప్పిన జగన్‌.. అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు.

ఆ తర్వాత.. గుంటూరు ఎస్‌వీఎన్ కాలనీకి వెళ్లిన జగన్‌, క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డిని పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలు ఈ మధ్యే ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కోలుకుంటున్న సాంబిరెడ్డికి, ఆయన కుటుంబానికి జగన్‌ ధైర్యం చెప్పారు. పార్టీ అన్నివిధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారాయన.  ఈ పరామర్శలో జగన్‌ వెంట స్థానిక వైస్సార్‌సీపీ నేతలు కూడా ఉన్నారు.



అడుగడుగునా అభిమానం
గుంటూరు పర్యటనలో జగన్‌పై ప్రజాభిమానం మరోసారి వెల్లువెత్తింది. దారిపొడవునా ఆయన కోసం అభిమానులు, పార్టీకార్యకర్తలు బారులు తీరారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఓపికగా.. ఆ అభిమానానికి అభివాదం చేసిన జగన్‌.. సెల్ఫీలు కూడా దిగారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement