బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-3) | Will Chandrababu Answer Questions On Education Health Housing Welfare | Sakshi
Sakshi News home page

బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-3)

Feb 19 2024 8:27 PM | Updated on Feb 19 2024 8:29 PM

Will Chandrababu Answer Questions On Education Health Housing Welfare - Sakshi

‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్‌ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు.

లేస్తే మనిషిని కానన్నట్టుగానే. అందుకే... ఐదేళ్లుగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి తన వల్ల మంచి జరిగి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయమని ధీమాగా చెబుతున్నారు. జగన్‌ అది చేశారా? ఇది చేశారా? అని పచ్చమంద నోరు పారేసుకునే ముందు.. ఒక్కసారి ఈ ప్రశ్నలకు జవాబు ఉందేమో చూసుకోండి! 

ప్రభుత్వ విద్యపై చర్చకు సిద్ధమా బాబూ!

  • 45 వేల సర్కారు బడులు ఎంత అద్భుతంగా మారాయో చర్చిద్దాం
  • 43 లక్షల మంది పేదింటి విద్యార్థుల జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూస్తావా!
  • అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్దపై కూడా చర్చిద్దామా..
  • జూన్‌ 2019- జనవరి 2024 వరకు విద్యా సంస్కరణలపై కూడా..
  • ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్న పేదింటి పిల్లల ఆత్మవిశ్వాసంపై చర్చకు సిద్ధమా
  • ప్రభుత్వ బడుల్లో చదివి పది, ఇంటర్‌లో స్టేట్‌ టాపర్స్‌గా వచ్చిన విద్యార్థుల ప్రతిభపై చర్చిద్దాం
  • 55 నెలల్లో విద్యా సంస్కరణలు తెచ్చిన మార్పుపై చర్చిద్దాం
  • డిజిటల్‌ విద్య, టోఫెల్‌, సీబీఎస్‌ఈ, ఐబీ అమలుపై చర్చకు కూడా సిద్ధమే
  • నీ పాలనతో నీరుగార్చిన మధ్యాహ్న భోజనంపై చర్చకు సిద్ధమా
  • ఆంధ్రా విద్యా ప్రగతి ఐక్యరాజ్యసమితిలో వినిపించిన విద్యార్థులపైనా చర్చిద్దాం
  • నీవు చెల్లించాల్సిన రూ.1778 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చిద్దాం
  • నువ్వు విద్యార్థులకు ఇవ్వకుండా వదిలేసిన రూ.2164.68 కోట్ల బకాయిలపైనా సిద్ధమేనా?

 ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి నీ పాలనలో ఏం చేశావ్ బాబు?

  • కొత్తగా ఎన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశావ్?
  • ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతను అధిగమించేందుకు ఎన్ని పోస్టులు భర్తీ చేశావ్?
  • 108, 104 సేవలు బలోపేతం చేస్తూ కొన్న అంబులెన్సు, ఎంఎంయూ వాహనాలు ఎన్ని?
  • నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ ఆరోగ్యశ్రీ పథకం బలోపేతానికి మీరు తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా?
  • ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి ఒక్క చెప్పుకోదగ్గ కార్యక్రమాన్ని మీరు ప్రవేశ పెట్టరా?

పేదల సొంతింటి కల సాకారం చేస్తూ మీరు చేసిందేమిటి బాబు?

  • పెద్ద ఎత్తున భూ సేకరణ చేసి ఏ నాడైన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారా?
  • పేద మహిళల పేరిట మీ హయాంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు ఎన్నో లెక్క చెప్పండి?
  • 31 లక్షల మంది పేదలకు ఇళ్ల కల్పన రూపంలో మీరు రాష్ట్రంలో కొత్తగా ఊళ్లు నిర్మించిన చరిత్ర మీకు ఉందా?

 ఈ వార్త కూడా చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-2)

ఈ వార్త కూడా చదవండి:  బాబు.. వీటికి బదులేది? (పార్ట్‌-1)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement