దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు? | Why Jaya Prakash Narayana Take U Turn In AP Politics, Support NDA - Sakshi
Sakshi News home page

దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?

Published Thu, Mar 21 2024 1:57 PM

Why Jaya Prakash Narayana U Turn in Ap Politics Support NDA - Sakshi

జయప్రకాష్‌ నారాయణ..  తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు.  మాజీ ఐఏఎస్‌ అధికారిగా, లోక్‌సత్తా అనే పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలవకపోయినా.. మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగానే కాదు.. ఏపీ జనాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

‘‘ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్ధతు. అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయండి. నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు అయినా రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం’’
: జయప్రకాష్ నారాయణ

.. అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు కావొచ్చు. కానీ.. దానికి ఎంచుకున్న సమయం, సందర్భం కూడా చూడాలి కదా. ఇప్పుడు జేపీకి అలియాస్‌ నాగభైరవ జయప్రకాష్ చౌదరికి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. 

సీఎం జగన్‌ వచ్చిన తర్వాత పాఠశాలలు బాగుపడ్డాయి, పిల్లల చదువులు బాగున్నాయి, ఆస్పత్రులు బాగున్నాయి, వైద్యం బాగా అందుతోంది, అభివృద్ది పెరిగింది అంటూ ఇన్నాళ్లు మీరు యూట్యూబ్‌లో చేసిన వీడియోలకు మీ మాటలకు పొంతన ఎందుకు కుదరడం లేదు?

పేదలు బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా?

పేదపిల్లలు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం జేపీ గారికి నచ్చటం లేదా?

ప్రజలందరికి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఇబ్బడిముబ్బడిగా మెడికల్ కాలేజీలు పెట్టటం .. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టటం జెపిగారికి నచ్చటం లేదా? 

పేద ప్రజలకి తలదాచుకునేదుందుకు 30 లక్షల మందికి  ఇంటి స్థలాలిచ్చి ఇల్లు కట్టించటం జేపీ గారికి నచ్చటం లేదా?

గడచిన 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా 950 కిలోమిటర్లు తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయటం .. అందులో భాగంగా ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ కానీ లేదా ఫిషింగ్ హార్బర్ కానీ పెట్టటం జేపీ గారికి నచ్చటం లేదా?

దక్షిణ భారతదేశం మొత్తానికి మనమే విధ్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరాలనే లక్ష్యంతో అనేకరకమైన విద్యుతు ప్లాంటులు నిర్మించటం జేపీ గారికి నచ్చటం లేదా?

ఎక్కడా లంచాలకి తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే ఇవ్వటం జేపీ గారికి నచ్చటం లేదా?

ఇటుపక్క కాకినాడ సెజ్ అటుపక్క శ్రీసిటీలలో అనేక కొత్త కంపెనీలు రావటం జేపీ గారికి నచ్చటం లేదా?

ఉద్దానం సమస్యని పరిష్కారించటం నచ్చలేదు .. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టటం జేపీ గారికి నచ్చటం లేదా?

రాష్ట్ర తలసరి ఆదాయం పెరగటం జేపీ గారికి నచ్చటం లేదా?

16 లక్షల మంది కొత్తగా టాక్స్ పేయర్లు పెరగటం కూడా జేపీ గారికి నచ్చటం లేదా?

విద్యా వైద్యంలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండటం జేపీ గారికి నచ్చటం లేదా?

కేంద్ర మరియు ఇతర రాష్ట్రాలతో పోల్చినా లేదా అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చినా ప్రతీ రంగంలో మన రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించటం జేపీ గారికి నచ్చటం లేదా?

ఇలా ఒకటేమిటి అనేకం .. అసలు రాష్ట్రం బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా?.. అంతే కాదండోయ్ .. లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు రామోజీ ముఠా మీద కేసులు పెట్టటం జేపీ గారికి అసలే నచ్చటం లేదా?

విద్యారంగం వైద్యరంగం విద్యుత్ రంగం లాంటి వన్నీ ఒక్క కులం చేతిలోనే ఉండాలా? .. ముఠాలుగా ఏర్పడి ప్రజలని దోచుకోవాలా?  పేద ప్రజలు మీ ఇళ్ల పక్కన ఉండటానికి వీల్లేదా? దోమలమీద యుద్ధం .. పుష్కరాలకు లైట్లు రంగుల పేరుతో రాష్టాన్ని దోచుకోవాలి ... దోచుకున్న డబ్బులతో ఓట్లు కొనాలి .. కేసుల్లేకుండా వ్యవస్థల్ని మానేజ్ చేయాలి .. అప్పుడే మీకు నచ్చుతుందా? అలా చేసే వాళ్ళకే మీరు మద్ధతిస్తారా?.. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement