కడియంకే టికెట్‌.. ఘన్‌పూర్‌లో ఉత్కంఠ!

Warangal: Who Will Next Incumbent in Station Ghanpur Constituency - Sakshi

నియోజకవర్గం పేరు : స్టేషన్‌ ఘనపూర్‌ (SC రిజర్వుడు)

మండలాల సంఖ్య : 7(స్టేషన్ ఘనపూర్, చిల్పూర్, జాఫర్ ఘడ్, లింగాల ఘనపూర్, రఘునాథపల్లి, వేలేరు, ధర్మసాగర్)

పెద్ద మండలం : రఘునాథపల్లి 

మొత్తం గ్రామ పంచాయతీలు : 165

మొత్తం ఓటర్లు సంఖ్య : 2,34,229

పురుషులు : 1,16,788; మహిళలు : 1,17,439; ట్రాన్స్‌ జెండర్స్‌ : 2

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇద్దరు నేతలు మాత్రమే డిప్యూటీ సీఎంలుగా అయ్యారు. వారిద్దరు కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన వారే కావడం విశేషం. తొలి డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య కాగా.. రెండో ఉప ముఖ్యమంత్రి.. కడియం శ్రీహరి. వీళ్లిద్దరూ ఈ నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ విరోధులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉంటూ నువ్వా-నేనా అనే స్థాయిలో పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. రాజయ్య ప్రస్తుతం ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు.

నియోజకవర్గంలోని రాజకీయ అంశాలు :

సిట్టింగ్‌లకే టికెట్‌ ఇస్తామన్న అధిష్టానం స్టేషన్‌ ఘనపూర్‌ విషయంలో తన మాట తప్పింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యకు కాకుండా.. కడియంకు టికెట్‌ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు, బీఆర్ఎస్ పార్టీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో టీడీపీ నుండి కడియం శ్రీహరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేశారు.

మళ్ళీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత BRSలో  చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఏమ్మెల్సిగా ఉప ముఖ్యమంత్రిగా ( విద్యాశాఖ మంత్రి) పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి సింగపురం ఇందిరా, దొమ్మాటి సాంబయ్య ఉన్నారు. బిజేపి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. 

నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు :

ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తెలంగాణా రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి అయ్యారు. అనతి కాలంలోని పదవి పొగొట్టుకుని ఆయన స్థానంలో కడియం శ్రీహారి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి మద్య అధికార పార్టీ బిఆర్ఎస్లో టిక్కెట్ వార్ సాగుతుంది. చివరికి ఈ వార్‌లో కడియాన్ని టికెట్‌ వరించింది. జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసే పరిస్థితి ఏర్పడింది. 

ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు :

ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, అభివృద్దికి నోచుకోకపోవడం. ధళితబందు పథకంలో కమీషన్ల దందా సాగడం, భూసమస్యలు పరిష్కారం కాకపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులకు లభించకపోవడం

ప్రధాన పార్టీలోని అభ్యర్థులు :

బీఆర్‌ఎస్‌

 • కడియం శ్రీహరి (కన్‌ఫాం)

కాంగ్రెస్‌ (ఆశావాహులు)

 • సింగపురం ఇందిరా
 • దొమ్మాటి సాంబయ్య
 • బొల్లెపల్లి కృష్ణ

బీజేపీ (ఆశావాహులు)

 • డాక్టర్‌ విజయరామారవు
 • మాదాసు వెంకటేష్‌ బోజ్జపల్లి సుభాస్‌

మతం/కులం పరంగా ఓటర్లు :

 • ఎస్సీ ఓటర్లు ఆతర్వాత బిసి ఓటర్లు అధికంగా ఉంటారు.

నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. 

 • నియోజకవర్గం రెండు జిల్లాల కలయికతో ఉంటుంది. జనగామతోపాటు హన్మకొండ జిల్లాలో నియోజకవర్గం ఉంది.
 • బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం (చిలుపూరు గుట్ట)
 • సీతారామచంద్రస్వామి ఆలయం (జీడికల్)
 • మల్లన్న గండి రిజర్వాయర్, స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్, కిలా షాపూర్, జఫర్గడ్, తాటికొండ కోటలు, కాకతీయుల నాటి 500 పిల్లర్ టెంపుల్ (నిడిగొండ రఘునాథపల్లి మండలం) (పర్యాటకం)
 • ఆకేరు వాగు(ఉప్పుగల్, జాఫర్గడ్ మండలం)
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-11-2023
Nov 10, 2023, 20:15 IST
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే...
10-11-2023
Nov 10, 2023, 17:29 IST
మైనారిటీలను బీసీల్లో చేరుస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదన వెంటనే వెనక్కి.. 
10-11-2023
Nov 10, 2023, 15:29 IST
2018 ఎన్నికలకు  2,644 నామినేషన్లు రాగా.. ఈసారి నిన్నటితోనే ఏకంగా.. 
10-11-2023
Nov 10, 2023, 12:41 IST
సాక్షి, సూర్యాపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంతో మంది నేతలు సిద్ధమయ్యారు. గత ఐదేళ్లుగా పార్టీనే నమ్ముకుని.. ప్రజలతో...
10-11-2023
Nov 10, 2023, 12:08 IST
పరకాల: ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గురువారం ఏకాదశి కావడంతో మంచిరోజు అని.. నామినేషన్లు వేసేందుకు ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయానికి చేరుకున్నారు....
10-11-2023
Nov 10, 2023, 06:25 IST
మధిర/సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు వచ్చిన అవకాశం, మళ్లీ తనకు దక్కనుందని...
10-11-2023
Nov 10, 2023, 06:16 IST
సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు...
10-11-2023
Nov 10, 2023, 05:50 IST
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్‌ చేతుల్లో రాష్ట్రం...
10-11-2023
Nov 10, 2023, 05:46 IST
సిరిసిల్ల/ కొడంగల్‌: తెలంగాణ 60ఏళ్ల గోస పోయేలా సీఎం కేసీఆర్‌ పోరాడి రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణ కోసం మాట్లాడే ఏకైక...
10-11-2023
Nov 10, 2023, 05:40 IST
సాక్షి, సిద్దిపేట/ సాక్షి, కామారెడ్డి: బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పేరిట విడిగా సొంత కారు, ద్విచక్ర వాహనం,...
10-11-2023
Nov 10, 2023, 05:18 IST
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల చివరి,...
10-11-2023
Nov 10, 2023, 05:05 IST
సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగుస్తుండటంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ప్రచారంపై ఫోకస్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది....
10-11-2023
Nov 10, 2023, 04:43 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్‌ అమలు చేస్తామని కాంగ్రెస్‌...
10-11-2023
Nov 10, 2023, 04:37 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం శుక్రవారం ముగియనుంది. గురువారం ఏకాదశి సుముహూర్తం కావడంతో...
10-11-2023
Nov 10, 2023, 04:29 IST
సాక్షి, హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే అధికారికంగా జాబితా విడుదల...
10-11-2023
Nov 10, 2023, 04:15 IST
సాక్షి, కామారెడ్డి/గజ్వేల్‌: తెలంగాణ ప్రజలను ఆగం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీల నేతలు వస్తున్నారని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌...
09-11-2023
Nov 09, 2023, 16:38 IST
బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు.. 
09-11-2023
Nov 09, 2023, 15:40 IST
కామారెడ్డికి కేసీఆర్‌ ఒక్కడే రాడని.. కేసీఆర్‌ వెంట చాలా వస్తాయని బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో.. 
09-11-2023
Nov 09, 2023, 13:15 IST
కథలాపూర్‌ (వేములవాడ): ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు సహజం. ప్రజాప్రతినిధులకు మాత్రం పదోన్నతులు ఉండవు. కానీ కథలాపూర్‌ జెడ్పీటీసీలుగా పదవీ బాధ్యతలు...
09-11-2023
Nov 09, 2023, 12:40 IST
సాక్షి, వరంగల్‌: జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. నవంబర్‌ 30న ఎన్నికలు ఉండడంతో ప్రత్యర్థి ఎత్తులను చిత్తు... 

Read also in:
Back to Top