కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్‌

Vivek Revealed In His Election Affidavit That He Gave 1 Crore Loan For Kcr - Sakshi

 కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికీ కోటిన్నర అప్పు ఇచ్చారట

ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడి

రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నేతగా వివేక్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అ భ్యరి్థగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్‌.. సీఎం కేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చినట్టుగా తన అఫిడవిట్‌లో పేర్కొన్నా రు. అదేవిధంగా రామలింగారెడ్డికి రూ.10లక్షలు, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.1.50కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు.

మొత్తంగా రూ.23.99 కోట్లను వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లుగా పేర్కొన్న వివేక్‌ ఆయనకు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో ఈ మాజీ ఎంపీ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో రూ.377కోట్లు ఉండగా, విశాఖ కంపెనీతో సహా పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు తెలిపారు.

రెండో స్థానంలో పొంగులేటి:
ఆ తర్వాత పాలేరు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.460కోట్ల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత సీఎ కేసీఆర్‌ తన అఫిడవిట్‌లో తన కుటుంబ ఆస్తులు రూ.59కోట్లు ఉన్నట్లు, సొంత కారు కూడా లేదని పేర్కొనడం తెలిసిందే. అయితే తాను మాజీ ఎంపీ వివేక్‌కు రూ.1.06కోట్లు అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ వివేక్‌ సీఎం కేసీఆర్‌కు మ«ధ్య లావాదేవీలు జరిగినట్లు, గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఈ డబ్బులు ఇచి్చనట్లు పార్టీ నాయకులు అనుకుంటున్నారు.
చదవండి: తెలంగాణకు మోదీ గ్యారంటీలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top