‘బాబులో వణుకు మొదలైంది’ | Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter | Sakshi
Sakshi News home page

‘బాబులో వణుకు మొదలైంది’

Dec 5 2020 1:14 PM | Updated on Dec 5 2020 1:51 PM

Vijaya Sai Reddy Criticized Chandrababu Naidu On Twitter - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. 'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 106 స్థానాల్లో పోటీచేస్తే దక్కింది సున్నా! కిందటిసారి తండ్రీకొడుకులు, మద్ధతుదారులైన సినీనటులు ప్రచారం చేస్తే ఒక్కటంటే ఒక్కటి గెల్చారు. బాబు పార్టీ ఎగబాకుతుందో దిగజారుతుందో చెప్పడానికి ఈ ఫలితాలే సాక్ష్యం. ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగినా రిజల్ట్‌ ఇలాగే ఉంటుంది' అంటూ ట్వీట్‌ చేశారు.  చదవండి: (సోషల్‌ మీడియా కార్యకర్తలను విస్మరించం..)

'అమూల్‌ రాకతో వేల కోట్ల హెరిటేజ్‌ డెయిరీ సామ్రాజ్యం కుప్పకూలుతుందని వణికిపోతున్నాడు బాబు. దేశంలో అతిపెద్ద సహకార డెయిరీ అమూల్‌పై పార్టీ నేతలతో విషం చిమ్మిస్తున్నాడు. కిందపడి ఎంతలా కొట్టుకున్నా.. పాల ఉత్పత్తిలో రాష్ట్రం రెండేళ్లలో అగ్రస్థానానికి దూసుకుపోతుంది' అంటూ వరుస ట్వీట్లు చేశారు.  చదవండి:  ('ఇద్దరూ తలుపులు బిగించుకొని ఇంట్లో దాక్కున్నారు')

Advertisement
 
Advertisement
Advertisement