‘ఉండి’ టీడీపీ టికెట్‌: ఎమ్మెల్యే రామరాజు కంటతడి | Undi Mla Ramaraju Comments On Denying Tdp Ticket | Sakshi
Sakshi News home page

‘ఉండి’ గందరగోళం: ఎమ్మెల్యే రామరాజు కంటతడి

Apr 9 2024 7:09 PM | Updated on Apr 9 2024 9:51 PM

Undi Mla Ramaraju Comments On Denying Tdp Ticket - Sakshi

సాక్షి,పశ్చిమగోదావరి: తన నియోజకవర్గం నుంచి వేరొకరికి టీడీపీ టికెట్‌ ఇస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి పెట్టారు. మంగళవారం(ఏప్రిల్‌9) కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం అనంతరం  రామరాజు మీడియాతో మాట్లాడారు.

‘నా నియోజకవర్గం నుంచి  వేరొకరికి  టికెట్‌ కేటాయించేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా. వారే నా కుటుంబ సభ్యులు..వారు చెప్పినట్టు చెస్తా. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా’ అని రామరాజు  చెప్పారు. 

‘ఉండి’ సీటుపై టీడీపీ శ్రేణుల్లో అయోమయం

ఉండి నుంచి కాకుండా ఎమ్మెల్యే రామరాజుకు మరో చోట టీడీపీ టికెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.  సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళనకు ఆందోళనకు దిగింది. రామరాజు సీటు మార్చొద్దంటూ కార్యకర్తలు నిరసన తెలిపారు.

కాగా, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రఘురామకృష్ణం రాజు పోటీచేస్తారని ఇటీవల పాలకొల్లు ప్రచారంలో చంద్రబాబు ప్రకటించడంతో రామరాజు వర్గంలో టెన్షన్‌ మొదలైంది.  

ఇదీ చదవండి.. మూడు ముక్కలైన ఉండి టీడీపీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement