
సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్ మూడు ముక్కలు కాబోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఇచ్చిన ఝలక్‌తో కేటీఆర్‌కు మతి భ్రమించిందన్నారు. ఇంట్లో కంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారంటూ చెప్పుకొచ్చారు. కవిత ఎపిసోడ్ డైవర్ట్ చేసేందుకే తమపై ఆరోపణలు చేశారన్న మహేష్ గౌడ్.. పది సంవత్సరాల బీఆర్ఎస్ తప్పిదాలను కవిత ఎత్తి చూపిందన్నారు.
బీఆర్ఎస్ తప్పిదాలన్ని ప్రజలకు అర్థమవుతున్నాయి. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌కు నోటీసులతో.. కేటీఆర్ భయపడుతున్నాడు. బీఆర్‌ఎస్‌కు, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రం కావడంతో అదను కోసం హరీష్ రావు ఎదురుచూస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారు’’ అంటూ మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు.
‘‘కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలి. పదేళ్ల అవినీతిలో పంపకాల్లో వచ్చిన తేడాతోనే.. కవిత జెండా ఎగరవేసినట్లు అర్థమవుతుంది. భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు’’ అంటూ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.