మెజార్టీ ఎమ్మెల్యేల తీరు బాగాలేదు: టీపీసీసీ చీఫ్‌ | TPCC Chief Mahesh Goud Sensational Comments on MLAs | Sakshi
Sakshi News home page

మెజార్టీ ఎమ్మెల్యేల తీరు బాగాలేదు: టీపీసీసీ చీఫ్‌

Jun 6 2025 5:49 PM | Updated on Jun 6 2025 6:05 PM

TPCC Chief Mahesh Goud Sensational Comments on MLAs

హైదరాబాద్‌  మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటూ టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎమ్మెల్యేలు తమ పని తీరును బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పలువురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారని, వారిని సమస్వయం చేసుకోవాల్సి న అవసరం ఉందన్నారు మహేష్‌ గౌడ్‌. 

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లో మహేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ‘మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు..సరిద్దిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలి. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మేల్యేలు కృషి చేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

‘పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టండి..
పార్టీ బలోపేతం పై ప్రత్యేక దృష్టి సారించాలి. అధికారంలో ఉన్నపుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి. పార్టీ సమర్ధవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామ స్థాయి బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిశక్తి వంచన లేకుండా ప్రభుత్వం పని చేస్తోంది. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. కార్యకర్తలు నిరాశగా ఉన్నారు..వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఉద్యోగాలు, విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదు జూన్ మాసంలో పిసిసి కార్యవర్గం,  మంత్రి వర్గ విస్తరణ పూర్తి అయ్యే అవకాశం ఉంది. శాస్ర్తీయ బద్దంగా కుల సర్వే,  బిసిలకు 42 శాతం రిజ్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది’ అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement