Today Telugu Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!

Telugu Top 10 News Today Evening Highlight 3rd July 2022 - Sakshi

1. తెలంగాణపై ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన బీజేపీ
తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. బీజేపీ సభ వేళ టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్లాన్స్‌ రచిస్తున్న వేళ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి బడంగ్‌పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ
భారీ భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వరదాపురం సూరిపై ఏసీబీ విచారణ మొదలైంది. అనంతపురం జిల్లాలో భారీగా భూ అక్రమాలకు పాల్పడటంతో పాటు టీడీపీ హయాంలో అధికార బలంతో ప్రభుత్వ భూములను అక్రమంగా కొనుగోలు చేశారు. 2014–19 మధ్య కాలంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి...ఆ సమయంలోనే రూ.కోట్లు విలువైన భూములను అక్రమంగా తీసుకున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మహారాష్ట్ర స్పీకర్‌గా రాహుల్‌ నర్వేకర్‌.. థాక్రేకు షాక్‌
మహారాష్ట్రలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏక్‌నాథ్‌ శిండే సర్కార్‌ బలపరీక్షకు సిద్ధమైంది. అందుకోసం రెండు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలను జరిపేందుకు సిద్దమైంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. అత్యంత హాస్యభరితమైన జోక్‌ ఇది! అది ఏంటంటే?
ఏదైనా జోక్‌ వింటే చటుక్కున నవ్వు వచ్చేస్తుంది.. కానీ అన్ని జోకులు అందరికీ నచ్చవు. కొన్ని సార్లు పడీ పడీ నవ్వేస్తుంటాం.. మరికొన్ని సార్లు చిన్నగా నవ్వి ఊరుకుంటాం. మరి ఎన్నో జోక్‌లు ఉన్నా ఎక్కువ మందికి నచ్చే జోక్‌ ఏమిటన్న డౌట్‌ వస్తుంది కదా.. రిచర్డ్‌ వైస్‌మాన్‌ అనే సైకాలజిస్టుకూ ఇదే అనుమానం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బాగా ఇష్టపడే జోక్‌ ఏమిటా అన్న దానిపై ఓ ప్రయోగం మొదలుపెట్టాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Lamborghini Aventador Car: ఇండియాలో రెండో లక్కీయెస్ట్‌ ఓనర్‌!
లగ్జరీ స్పోర్ట్స్ కార్లు అండ్ ఎస్‌యూ‌వీలను అందించే ఇటలీ కార్‌ మేకర్‌ లంబోర్ఘిని లేటెస్ట్‌ సూపర్‌ కార్‌ అవెంటడోర్ అల్టిమే రోడ్‌స్టర్‌  రెండో కారును భారత మార్కెట్లో డెలివరీ చేసింది. గ్లోబల్‌గా  లిమిటెడ్‌ ఎడిషన్‌గా లాంచ్‌ చేసిన ఈ కారులో రెండోది  ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టనుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌..!
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ అందింది. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు ముందు కరోనా బారిన పడిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలలో రోహిత్‌ శర్మకు నెగిటివ్‌గా తేలింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పెళ్లిళ్లు బాధాకరంగా ఉండేందుకు మీరే కారణం: సమంత
అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున‍్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. క్యాన్సర్‌తో బాధపడుతున్నారా.. బీట్‌రూట్‌ తిన్నారంటే..!
బీట్‌రూట్‌లో బిటాలెయిన్స్‌ అనే పోషకం ఉంటుంది. బీట్‌రూట్‌కు ఎర్రటి రంగునిచ్చేది ఇదే. ఇదో శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్‌. అంతేకాదు... బీట్‌రూట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. క్యాన్సర్‌ను నివారించడంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కీలక భూమిక పోషిస్తాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. పెళ్లి అయి మూడు నెలలు కాకుండానే.. వ్యాయామం చేస్తూ..
ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆషాడమాసం తర్వాత హనీమూన్‌ వెళ్లాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. విధి వక్రించింది. వ్యాయామం చేస్తున్న యువకుడు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆషాడ మాసానికని పుట్టింటికి వెళ్లిన భార్య భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top