Cancer Prevention: క్యాన్సర్‌తో బాధపడుతున్నారా.. బీట్‌రూట్‌ తిన్నారంటే..!

Beetroot as a Potential Food for Cancer - Sakshi

బీట్‌రూట్‌ క్యాన్సర్‌ను మూడు విధాలుగా నివారిస్తుంది.

1) బీట్‌రూట్‌లో బిటాలెయిన్స్‌ అనే పోషకం ఉంటుంది. బీట్‌రూట్‌కు ఎర్రటి రంగునిచ్చేది ఇదే. ఇదో శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్‌. అంతేకాదు... బీట్‌రూట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. క్యాన్సర్‌ను నివారించడంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కీలక భూమిక పోషిస్తాయి. బీటాలెయిన్స్‌లో ఉన్న యాంటీక్యాన్సరస్‌ గుణాల సహాయంతో అది క్యాన్సర్‌ను నివారిస్తుంది.  

2) బీట్‌రూట్‌లో విటమిన్‌–సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌–సి వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుందన్న విషయం తెలిసిందే. బీట్‌రూట్‌ వాడటం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ బలోపేతమౌతుంది. అది క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుంది. 

3) బీట్‌రూట్‌ రక్తంలోని హీమోగ్లోబిన్‌ను పెంచడం ద్వారా అన్ని కణాలకూ ఆక్సిజన్‌ను పెంచడానికి దోహదపడుతుంది. ఆక్సిజన్‌కు క్యాన్సర్‌ను తుదముట్టింటే శక్తి ఉంటుంది. పెరిగిన హీమోగ్లోబిన్‌ వల్ల, బీట్‌రూట్‌లోని పోషకాల వల్ల ఎక్కువ సేపు, మరింత స్టామినాతో వ్యాయామం చేసే సామర్థమూ పెరుగుతుంది. దాంతో కణాలకు ఆక్సిజన్‌ సప్లై మరింత పెరుగుతుంది. ఈ అంశం కూడా క్యాన్సర్‌ నివారణకు తోడ్పడేదే. వెరసి... ఇలా ఈ మూడంశాల ముప్పేట దాడితో క్యాన్సర్‌ను బీట్‌రూట్‌ సమర్థంగా నివారిస్తుంది.
చదవండి: Cancer Prevention: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్‌ బారిన పడినట్టే..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top