Samantha: పెళ్లిళ్లు బాధాకరంగా ఉండేందుకు మీరే కారణం: సమంత

Samantha Blames Karan Johar For Unhappy Marriages In KWK 7 Season - Sakshi

Samantha Blames Karan Johar For Unhappy Marriages In KWK 7 Season: అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున‍్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ షోతో ఫిల్మ్‌ మేకర్‌గానే కాకుండా మంచి హోస్ట్‌గా కరణ్‌ జోహార్‌ నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు 6 సీజన్లపాటు అలరించిన ఈ షో ఏడో సీజన్‌ రానున్నట్లు ఓ వీడియో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సీజన్‌లో పార్టిస్‌పేట్ చేసే సెలబ్రిటీలు, వారు చెప్పిన పలు ఆసక్తికర విషయాలను మరో ప్రోమో రూపంలో బయటకు ఒదిలాడు. 

ఇందులో భాగంగానే సమంత తన ఎపిసోడ్‌లో ఎన్నో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. కరణ్‌ జోహార్‌ను ఉద్దేశించి.. 'ఎంతోమంది వివాహబంధాలు బాధాకరంగా ఉండటానికి మీరే కారణం' అని సామ్‌ అనగానే 'నేనేం చేశాను' అని కరణ్‌ అడగ్గా.. 'పెళ్లి చేసుకుంటే జీవితం కబీ ఖుషి కబీ ఘమ్‌ (K3G) సినిమాలా ఉంటుందని స్క్రీన్‌పై చూపించారు. కానీ నిజ జీవితంలో మాత్రం అది KGF మూవీలా ఉంటుంది' అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సామ్‌తోపాటు ఈ ఎపిసోడ్‌లో అక్షయ్‌ కుమార్‌ కూడా పాల్గొన్నాడు. 

అలాగే ఈ సీజన్‌లో 'కబీర్ సింగ్‌' జోడీ షాహిద్ కపూర్‌, కియారా అడ్వాణీ, 'జుగ్‌ జుగ్‌ జియో' బృందం అనిల్‌ కపూర్, వరుణ్‌ ధావన్, 'లైగర్‌' జంట విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, బాలీవుడ్‌ బ్యూటీలు జాన్వీ కపూర్, సారా అలీఖాన్‌ అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ షో పూర్తి ఎపిసోడ్స్‌ ఎప్పుడెప్పుడూ వస్తాయా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top