ఎన్నికలు ఉంటేనే సీఎం బయటికొస్తారు..  | Telangana: YSRTP YS Sharmila Slams CM KCR | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ఉంటేనే సీఎం బయటికొస్తారు.. 

Feb 10 2023 2:12 AM | Updated on Feb 10 2023 2:12 AM

Telangana: YSRTP YS Sharmila Slams CM KCR - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌/రఘునాథపల్లి: సీఎం కేసీఆర్‌ దొర ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని, లేకుంటే ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆమె మాట్లాడుతూ ఈ ఏడాదిలో ఎన్నికలు వస్తాయని, కేసీఆర్‌ వచ్చి మళ్లీ పిట్టకథలు చెబుతారని అన్నారు.

ఇప్పుడు దళితబంధు అని మోసం చేస్తున్నారని, ఈసారి బీసీబంధు, ఎస్టీ బంధు అంటారని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్‌ మాటలు నమ్మితే మిమ్మల్ని మీ బిడ్డలే క్షమించరని, ఈసారి కేసీఆర్‌ వస్తే కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలను కోరారు. వైఎస్సార్‌టీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఉద్యోగాల కల్పనపైనే ఉంటుందని, ఇళ్లు లేని ప్రతి పేదకుటుంబానికి మహిళ పేరిట పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అందరికీ రూ.3వేలు పెన్షన్‌ను అందిస్తామని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement