Bandi Sanjay Says, Telangana New Secretariat BRS MIM Love Symbol - Sakshi
Sakshi News home page

కొత్త సచివాలయం వారి ప్రేమకు చిహ్నం: బండి సంజయ్‌ వ్యంగ్యాస్త్రాలు

Apr 30 2023 4:57 PM | Updated on Apr 30 2023 6:15 PM

Telangana New Secretariat BRS MIM Love Symbol Says Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంఐఎం, బీఆర్‌ఎస్ ప్రేమకు చిహ్నమే ఈ కొత్త సచివాలయ డిజైన్ అని సెటైర్లు వేశారు. వీరి ప్రేమకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు రాయబారులు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కొత్త సచివాలయాన్ని కూలగొడతానని తానెప్పుడూ అనలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో మరో ఐదు నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

రోజూ కేసీఆర్  ఆఫీస్‌కు వస్తారా?: ఈటల రాజేందర్‌
కరీంనగర్‌: నూతన సచివాలయం ప్రారంభంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కొత్త సచివాలయం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు, నాలుగు నెలలపాటు రోజు ఆఫీస్‌కు వస్తారా? అని ప్రశ్నించారు. ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేయడానికి, కేసీఆర్ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయాన్ని నిర్మించారని విమర్శించారు.తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణలో పాలన అస్తవ్యస్థమైందని ధ్వజమెత్తారు. కొత్త సచివాలయంలో అయినా పాలన బాగుపడాలని ఆశిస్తున్నాన్నట్లు తెలిపారు.
చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement