‘తమ్ముడూ.. నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు’ | Telangana Minister Seethakka Counter To MLA Kaushik Reddy | Sakshi
Sakshi News home page

‘తమ్ముడూ.. నీ లైఫ్ స్టైల్ వేరు.. నా లైఫ్ స్టైల్ వేరు’

Mar 22 2025 6:11 PM | Updated on Mar 22 2025 6:56 PM

Telangana Minister Seethakka Counter To MLA Kaushik Reddy

హైదరాబాద్: సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటిరిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీతక్క ఖండించారు. ‘ త‌మ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు. నియోజ‌క‌వర్గంలో నేను తిరిగిన‌ట్లు నువ్వు తిర‌గ‌లేవు. ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందాం. హైద‌రాబాద్ లో తిరిగే వాల్ల‌కు రైతులకు బోన‌స్ వ‌స్తుందో లేదో తెలుస్తుందా?,

రైతుల‌తో సంబందం లేకుండా హైద‌రాబాద్ లో తిరుగుతున్న‌ట్లు ఉంది. బోన‌స్  ఇస్తామ‌ని చెప్పి బోగ‌స్ చేసింది మీరు. వ‌రి వేస్తే ఉరి అన్న‌ది మీరు. 
ప్ర‌జా ప్ర‌భుత్వం సన్న వ‌డ్ల‌కు రూ. 1200 కోట్లు బోనస్ ఇచ్చింది. ఇంకా ఎవ‌రిక‌న్నా రాక‌పోతే అవి కూడా ఇస్తాం. రైతు కూలీల‌కు ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ఇస్తున్నాం. భూమి లేని వాల్ల‌కే కూలీ భ‌రోసా ఇస్తున్నాం. కొంత భూమి ఉన్న కూలీల‌కు ఇవ్వాల‌నే అంశం పరిశీల‌న‌లో ఉంది’అని సీతక్క పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ఇంటికి వచ్చి చూడండి..
‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా ఇంటికి వచ్చి చూడండి. మీరు మా ఇంటికి రావాలని ఆహ్వానం పలుకుతున్న.  ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్స్ లోనే నేను నివసిస్తున్నాను. వైఎస్ భవనంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నారు. అది మా ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనమే. ఆ భనంలోనే ఉంటున్నాను.  

మీలాగా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో నివసించడం లేదు. మా ఇంటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. మీ అందరిని భోజనానికి ఆహ్వానిస్తున్న... మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆహ్వానించలేదు. నాది నిరాడంబర జీవితం. నా కుమారుడు కూడా హన్మకొండ లోనే ఉంటాడు’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement