
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బడ్జెట్ వేళ.. బీఆర్‌ఎస్ పార్టీ అనూహ్య నిరసనకు దిగింది. ఎండిన వరికంకులతో ఆ పార్టీ సభ్యులు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్‌ను ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు.
ఇది కాలం తెచ్చి కరువు కాదు. రేవంత్ తెచ్చిన కరువు. ముందుచూపు లేని దున్నపోతు ప్రభుత్వం ఇది. ప్రాజెక్టులలో నీరు ఉన్నా వదలడం లేదు. చంద్రబాబు మీద ప్రేమతో కిందకు నీరు వదిలారు. కేసీఆర్‌పై కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయకుండా ఇసుక దోచేస్తున్నారు. 400 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండబెట్టారు. కరువుతో ఓవైపు రైతులు అల్లలాడుతుంటే.. అందాల పోటీలు కావాల్సి వచ్చిందా? అని కేటీఆర్ అన్నారు. అని కేటీఆర్ మండిపడ్డారు.