మీకొచ్చిన పదవులే బీజేపీ భిక్ష

Telangana: Bandi Sanjay Speech At Praja Sangrama Yatra - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ 

సుష్మాస్వరాజ్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదా? 

100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న 2వ విడత ప్రజాసంగ్రామయాత్ర 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: టీఆర్‌ఎస్‌ పెట్టిన భిక్ష వల్లే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఘాటుగా స్పందించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చి రాష్ట్రం వచ్చేలా చేసిన వ్యక్తి అప్పటి బీజేపీ లోక్‌సభాపక్షనేత సుష్మాస్వరాజ్‌ అని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ వారు అనుభవిస్తున్న పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలన్నారు.

‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతివంతమైన పాలన అందిస్తున్న పార్టీ మాది.  దొంగ దీక్షలు.. దొంగ హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ మీది.  అలాంటి మీరా.. దేశం, ధర్మం కోసం పని చేస్తున్న బీజేపీపై విమర్శలు చేసేది’అని ధ్వజమెత్తారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర పదోరోజు శనివారం మక్తల్‌ నియోజకవర్గంలోని అమరచింత మండలం కిష్టంపల్లి నుంచి ప్రారంభమైంది.

రాత్రి నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్ద కడుమూరుకు చేరుకుంది. ఈ యాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కిష్టంపల్లి చౌరస్తాలో సంజయ్‌ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో కొం దరు మూర్ఖులు తాను తంబాకు తింటానని విషప్రచారం చేస్తున్నారని, తాను నమిలేది లవంగాలని, మద్యం, డ్రగ్స్‌ అలవాటున్నది టీఆర్‌ఎస్‌ నేతలకేనన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల వెంట్రుకలను పరీక్షిస్తే డ్రగ్స్‌ బాగోతం బయటపడుతుందన్నారు.  

పెట్రో ఆదాయంతోనే రాష్ట్రానికి మనుగడ 
పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే మోదీని నిందించడం.. అందులో తమ పాత్ర ఏమీ లేదన్నట్లు వ్యవహరిస్తుండటం రాష్ట్ర మం త్రులకు, అధికారపక్ష నేతలు, ఇతర ప్రతిపక్షాలకు సైతం పరిపాటైందని సంజయ్‌ విమర్శించారు. కేంద్రంపై బురద చల్లడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీఆర్‌ఎస్‌ నేత లు ప్రయత్నిస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెట్రో చార్జీల్లో నయాపైసా కూడా వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top