Karimnagar: విమానం ఎగిరేనా? ఏళ్లుగా ప‌రిష్కారం నోచుకొని స‌మ‌స్య‌లు ఇవే..

Telangana Assembly Elections: Un Solved Problems In Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 31,12,283 లక్షల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్ల సంఖ్య రాష్ట్రం మొత్తం ఓటర్లలో 10వ శాతం కావడం గమనార్హం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కరీంనగర్‌.. అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రం నుంచే తన ఘనత చాటుకుంటోంది. రాజకీయంగా ప్రభావం చేయగలిగిన ఈ జిల్లాలో కొన్ని సమస్యలు ఏళ్లుగా పరిష్కారం నోచుకోకుండా మిగిలిపోయాయి. 

గోదా‘వర్రీ
పెద్దపల్లి జిల్లాలో ప్రవహించే గోదావరి నదీజలాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయి. రామగుండం కార్పొరేషన్‌ డ్రైనేజీ నీరు,  రసాయనాలను నేరుగా నీటిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీల నిర్మాణంతో ఏడాది పొడువునా నీరు నిల్వ ఉంటుంది. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో రోజుకు సుమారు 70మిలియన్‌ లీటర్ల నీటిని ప్రజలు వినియోగిస్తున్నారు. అందులోంచి రోజుకు 40మిలియన్‌ లీటర్ల మురుగు గోదావరిలో కలుస్తుంది. 

ఆదాయపన్ను, మారుపేర్లు, ప్రైవేటీకరణ భూతం
రామగుండం సింగరేణిలో రెండున్నర దశాబ్దాల కాలంగా మారుపేర్ల మార్పిడికి చట్టబద్ధత కోసం కోసం కార్మికులుఎదురుచూస్తున్నారు. గతంలో ఈ సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చినా ఇంకా అమలుకు నోచుకోలేదు. మరోవైపు తమకు ఆదాయపు పన్ను మినహాయించాలని డిమాండ్‌ కోరుతున్నారు. అలాగే కోల్‌ బ్లాకులను ప్రైవేటు పరం చేయవద్దని కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. 

విమానం ఎగిరేనా..? 
1980లో కేశోరాం సిమెంట్‌ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా వచ్చేందుకు 294 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మా ణం చేపట్టారు. 21 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్న విమానాలు రాకపోకలు సాగించేవి.  2009లో దీన్ని రామగుండం ఎయిర్‌పోర్టు పేరిట అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా అవి అటకెక్కాయి.  2016లో ఉడాన్‌ పథకంలో భాగంగా 2020లో ఎయిర్‌ ఫోర్స్‌ అథారిటీ ఆఫ్‌ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో పలు భౌగోళిక సర్వేలు నిర్వహించినా అడుగు ముందుకు పడలేదు. 

నాలుగోసారి నిర్వాసితులు.. 
కరీంనగర్‌ జిల్లాలో అదనపు టీఎంసీ కాలువ పనుల్లో భాగంగా రామడుగు, గంగాధర మండలాల్లో పలువురు నిర్వాసితులు నాలుగోసారి భూమిని కోల్పోతున్నారు. ఎవరైనా ఒకసారి కోల్పోవడం సాధారణం, రెండుసార్లు కోల్పోవడమే అరుదు. కానీ, ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనుల వల్ల ఈ మండలాల్లో కొన్ని గ్రామాలవారు నాలుగు తరాలుగా నిర్వాసితులుగా మారిపోయారు. 

ఈఎస్‌ఐ ఆస్పత్రి కావాలి.. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో లక్షలాది మంది బీడీ కారి్మకులు ఉన్నారు. మున్సిపల్, పలు పరిశ్రమల్లో పనిచేసేవారికి ప్రతి నెలా వేతనం నుంచి ఈఎస్‌ఐ కట్‌ అవుతుంది. కానీ, ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాలో రామగుండంలో ఉంది. అసలు రామగుండంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అత్యవసరాల్లో శస్త్రచికిత్స సమయంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో 
ఒక ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు 
చేయాలని లక్షలాది మంది కార్మికులు 
కోరుతున్నారు.

తెలంగాణలో కొన్ని రాజ‌కీయ కుటుంబాల ప్రాధాన్య‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. వాటిలో ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ గురించి ముందుగా తెలుసుకోవాలి. అస‌దుద్దీన్ తండ్రి స‌లావుద్దీన్‌ ఒవైసీ 1962 నుంచి 2004 వ‌ర‌కు ఎమ్మెల్యే, ఎంపీ ప‌ద‌వులు నిర్వ‌హిస్తే, 1994లో అస‌ద్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఇప్ప‌టికీ కొన‌సాగగుతున్నారు.

1999 నుంచి అస‌ద్ సోద‌రుడు అక్బ‌రుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా వ‌రుస‌గా గెలుస్తున్నారు. ఆ ర‌కంగా అర‌వై ఒక్క సంవ‌త్స‌రాలుగా ఒవైసీ కుటుంబం రాజ‌కీయాల్లో క్రియాశీలకంగా ఉండ‌టం విశేషం.

ఆ కుటుంబం ప‌దిమార్లు లోక్‌స‌భ‌కు
స‌లావుద్దీన్ 1962 నుంచి అయిదుసార్లు శాస‌న‌స‌భకు, ఆరుసార్లు ఎంపీగా హైద‌రాబాద్ నుంచి గెలుపొందారు. అస‌ద్ రెండుసార్లు చార్మినార్ నుంచి అసెంబ్లీకి, త‌దుప‌రి 2004 నుంచి నాలుగుసార్లు హైద‌రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక అక్బ‌రుద్దీన్ ఒవైసీ చంద్రాయ‌ణ‌గుట్ట నుంచి 1999 నుంచి వ‌రుస‌గా అయిదు సార్లు గెలిచారు.

1999 లో తండ్రి లోక్‌స‌భ‌కు, ఇద్ద‌రు కుమారులు అసెంబ్లీకి ఎన్నిక‌వ‌డం ఒక ప్ర‌త్యేక‌త‌. స‌లావుద్దీన్‌, అస‌ద్ క‌లిసి ఇంత‌వ‌ర‌కు ప‌దిసార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యార‌న్న‌మాట‌. తండ్రి, ఇద్ద‌రు కుమారులు క‌లిసి ప‌న్నేండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వ‌హించారు.
చ‌ద‌వండి:

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top