
Telangana Assembly Elections Today Minute To Minute Update
భువనగిరి ఎమ్మెల్యేకు అక్షరం ముక్క రాదు: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
- కేసీఆర్ నీ కొడుకు కేటీఆర్, కవిత మీరు ఇక సామన్లు సర్దుకోవాల్సిందే.
- గ్రామంలో పేద ప్రజల బతుకులు బాగలేవు.
- భువనగిరి ఎమ్మెల్యేకు అసెంబ్లీ లో నోరు తిరుగదు.
- నేను మునుగోడు గురించి అసెంబ్లీ లో మాట్లాడుతుంటే నోరు వెళ్ల పెట్టుకుండు భువనగిరి ఎమ్మెల్యే.
- కేటీఆర్‌ను ముఖ్యమంత్రి అంటే మీరు ఒప్పుకుంటారా.
- బీఆర్‌ఎస్ పార్టీని బొంద పెట్టాలి.
- మద్యం కుంభ కోణంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు.
- బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.
- తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలి
- గొంగిడి సునీత ఎమ్మెల్యే కాకముందు ఒక్క రూపాయి లేదు. ఇప్పుడు కోట్లకు పడగెత్తారు.
- ఫైళ్ల శేఖర్ రెడ్డి పైసలు నమ్ముకున్నాడు. కుంభం అనిల్ ప్రజలను నమ్ముకున్నాడు
- పోలీసులు మా పార్టీ వాళ్ళను బెదిరిస్తున్నారు.
- కేసీఆర్‌ను గద్దె దింపాలి.
- కుటుంబ పాలన అంతం కావాలి. కాంగ్రెస్ పాలన రావాలి
దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కాం ధరణి: భట్టి విక్రమార్క
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో అదనంగా ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా?.
- పైపుల కోసమే మిషన్ భగీరథ స్కీం పెట్టినట్లు ఉంది.
- తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులే కనబడుతున్నాయి తప్ప బీఆర్‌ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని చూపిస్తారా?.
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తెలంగాణ ప్రజలకు అవసరమైనవే.
- ఉచిత విద్యుత్ ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు వైఎస్సార్.
- ఉచిత కరెంట్.. విద్యుత్ ఉత్పత్తులపై పేటెంట్ హక్కు కాంగ్రెస్‌దే.
- ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనంగా నాలుగు శాతం విద్యుత్ కేటాయించాం.
- తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారు?.
- 24 గంటల కరెంట్ ఇస్తుంటే లాగ్‌బుక్స్ ఎందుకు దాచిపెట్టారు?.
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని హామీలను నెరవేరుస్తాం.
- సంపద సృష్టించే అవకాశాలపై ఫోకస్ పెడతాం.
- మొట్టమొదటి సారి భూములపై హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే.
- మా పార్టీ హయాంలోనే పాస్‌పుస్తకాలు, పట్టాదారీ పుస్తకాలు ఇచ్చాం.
- దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కాం ధరణి.
- కేసీఆర్ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారు.
- ధరణి పెట్టింది దోచుకోవడానికే. ఏ రికార్డ్ చూసి ధరణిలో భూముల వివరాలు నమోదు చేశారు?.
- 70-85 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది.
- బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు.
- వందకు వంద శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సీఎం పదవిని ఆశించడంతో తప్పులేదు.
- కాంగ్రెస్‌లో అందరి అభిప్రాయం తీసుకుని ప్రొసీజర్స్ ప్రకారం సీఎంను ఎన్నుకుంటారు.
- అధిష్టానం నిర్ణయం మేరకే సీఎం అభ్యర్థి ఎన్నిక.
- అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు చేయిస్తాం.
- మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోనే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటో తేలిపోయాయి.
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది.
- బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లు అన్నింటిలోనూ అవినీతి జరిగింది.
- ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే అతి తక్కువ ఖర్చుతో తెలంగాణకు గోదావరి నీళ్లు వచ్చేవి.
- అనేక అబద్ధాలు చెప్పి కేసీఆర్ ఓట్లు వేయించుకున్నాడు. చెప్పిన పనులను పదేళ్లుగా కేసీఆర్ చేయలేదు.
- కేసీఆర్ ఏ హామీ ఇచ్చినా ప్రజలు పట్టించుకోవడం లేదు.
- తీసుకొచ్చిన అప్పులను కేసీఆర్ ఏం చేశారు?.
- రెండు లక్షల ఉద్యోగాలను మొదటి ఏడాదిలోనే భర్తీ చేస్తాం.
- కేంద్రంలో కూడా కాంగ్రెస్‌దే అధికారం.
బండి రమేష్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి: రేవంత్
- కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం.
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్‌పల్లిని అభివృద్ధి చేసి ఉంటే.. ఆయన ఇంట్లో కూర్చున్నా గెలిచేవారు.
- కృష్ణారావు కమీషన్లు ఎలా వసూలు చేయాలో ఆలోచించిండు తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేదు
- రెండుసార్లు కృష్ణారావుకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి బండి రమేష్‌కు అవకాశం ఇవ్వండి.
- పేదలకు ఇవ్వడానికి భూమి లేదన్న కేసీఆర్.. ఔటర్ చుట్టూ పదివేల ఎకరాలు ఆక్రమించుకున్నాడు
- కేసీఆర్ తాత దిగివచ్చినా ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటును ఆపలేరు.
- డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం.
- పేదల హక్కులు కాలరాయడానికే కేసీఆర్ గొర్రెలు, బర్రెలు, చేపలు అంటూ స్కీములు పెడుతున్నాడు
- ఈ కబ్జాకోరు నుంచి విముక్తి కలిగించేందుకే బండి రమేష్‌ను బరిలోకి దింపాము.
- కాంగ్రెస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే.. చర్యలు తప్పవు.
- అధికారంలోకి రాగానే సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం
ఈనెల 25 న తెలంగాణ పర్యటన కు రానున్న రాహుల్ గాంధీ..
- 25 నుంచి 28 వరకు తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ..
- 25 న ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేయనున్న రాహుల్ గాంధీ
- హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలిసుల వాహన తనిఖీలు
- కారులో తరలిస్తున్న రెండు కోట్ల రూపాయలు స్వాధీనం
- మంథని నియోజకవర్గం మహాముత్తారంలో మంగళవారం జరిగిన గొడవలో 28 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.
- ఏ1గా మహాముత్తారం మాజీ జెడ్పీటీసి మందల రాజిరెడ్డి. ఏ2 వెల్మారెడ్డి అనిల్ రెడ్డి.
- ఏ27గా మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు, ఏ 28గా బిట్టు శ్రీనుపై హత్యాయత్నం కేసులు నమోదు.
- ఏ2 వెల్మారెడ్డి అనిల్ రెడ్డి అరెస్ట్, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలింపు.
ఓవైసీ అంటే భయమెందుకు?: అస్సాం సీఎం హిమంత్ బిశ్వ
- చార్మినార్ సమీపంలోని శాలిబండ చౌరస్తాలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ.
- హాజరైన అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ..
- తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిమయంగా మారింది.
- బీజేపీ అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తాం.
- అవినీతికి కారణమైన వారిని జైలుకు పంపుతాం.
- కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నాయి.
- హిందు సమాజాన్ని విస్మరించే పార్టీలకు గుణపాఠం చెప్పాలి.
- ముస్లీం మైనార్టీలకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు.
- బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లీం మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తాం.
- ఓటింగ్ శాతం పెంచితే భాగ్యనగర్‌లో బీజేపీ గెలుస్తుంది
- కాంగ్రెస్, బీబిఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే.
- ఆ మూడు పార్టీలు ఏకమైనా బీజేపీ ఒంటరిగా ప్రజలు కోసం పోరాడుతుంది
- బీజేపీ ద్వారానే ప్రజలకు న్యాయం, మేలు జరుగుతుంది.
- తెలంగాణలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై అవినీతిలో కూరుక్కుపోయింది.
- నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుంది.
- పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించడంలో విఫలమయింది.
- కేసిఆర్ పని అయిపోయింది.
- తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.
- నగరం మొత్తం మెట్రో రైలు ఏర్పాటు చేస్తాం.
- అయోధ్య రామమందిరం బీజేపీ ద్వారానే సాధ్యమయ్యింది.
- యూపీ, అస్సాం, హర్యానాలో పోలీసులకు భిన్నంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఉంది.
- భాగ్యనగర్‌లో ఒక వర్గానికి పోలీసులు ఎందుకు బయపడుతున్నారు.
- ఓవైసీ అంటే భయమెందుకు?
- మేము అధికారంలోకి వచ్చాక ఏలాంటి భయం ఆందోళన ఉండదు.
- సీఈఓ వికాస్ రాజ్ ను కలిసిన ఎంఐఎం నేతలు
- నిన్న అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుపై కౌంటర్ ఫిర్యాధు
- ప్రచారం ముగింపుకు మరో 10నిమిషాలు ఉన్నప్పటికీ పోలీసులు డిస్ట్రబ్ చేశారు
- నిబంధనలు పాటించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు ఎంఐఎం కంప్లయింట్
పోలీస్ అధికారితో దురుసు ప్రవర్తనపై స్పందించిన అక్బరుద్దీన్ ఓవైసీ
- నా తప్పు లేదు
- పోలీసులు అనవసరంగా వైదికపైకి వచ్చారు
- నా దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి.
- ఆ పోలీస్‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాను.
ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోవాలి: లక్ష్మణ్
- ఓవైసీ సోదరులు నిసిగ్గుగా మాట్లాడుతున్నారు.
- అక్బరుద్దీన్ ఓవైసీపై చర్యలు తీసుకోవాలి.
- ఓవైసీ సోదరులకు చట్టాలు వర్తించవా.
- పాతబస్తీ తెలంగాణలో లేదా?
ఇందిరను తిట్టే స్థాయి నీకు లేదు కేసీఆర్: ఖర్గే ఫైర్
- పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఏం చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
- కేసీఆర్.. ఇందిరా గాంధీని కూడా తిడుతున్నారు.
- మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే.
- వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవు.
- హరిత విప్లవం వల్లే దేశంలో ఆహార కొరత తీరింది.
- నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకుంటే తెలంగాణ ఎలా ఉండేది?.
- దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరమ్మ.
- రైతులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం.
- దళితులు, నిరుపేదలకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం.
- హరిత, శ్వేత విప్లవం వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు?.
- మోదీతో అంటకాగడమే కేసీఆర్‌కు తెలుసు.
- తెలంగాణలో అవినీతి పెరిగిపోయింది. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబం కూరుకుపోయింది.
సీఈఓ వికాస్ రాజ్ ను కలిసిన ఎంఐఎం నేతలు
- నిన్న అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుపై కౌంటర్ ఫిర్యాధు
- ప్రచారం ముగింపుకు మరో 10నిమిషాలు ఉన్నప్పటికీ పోలీసులు డిస్ట్రబ్ చేశారు
- నిబంధనలు పాటించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు ఎంఐఎం కంప్లయింట్
ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే: సీఎం కేసీఆర్
- పరిగిలో బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభ
- బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం.
- కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించింది.
- ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్.
- గతంలో వలసలు, కరువు, కరెంట్ కష్టాలు, నీటి కష్టాలు ఉండేవి.
- తెలంగాణ వచ్చాక కరెంట్, నీటి కష్టాలు తీర్చుకున్నాం.
- విధి వంచితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.
- పెన్షన్ వెయ్యి నుంచి పెంచుకుంటూ వచ్చాం.
- మూడోసారి అధికారంలో ఇచ్చాక పెన్షన్ రూ. 5 వేలుచేస్తాం.
- కంటి వెలుగు కార్యక్రమం వస్తుందని ఎవరైనా ఊహించారా?.
- ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
- ధరణిని తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే’
- ప్రతీ ఇంటికీ నల్లా పెట్టి మంచినీరు అందించాం.
- తెలంగాణ నుంచి పేదరికం తరిమేయాలి.
- గత పదేళ్లుగా జరిగిన అభివృద్ధిని గమనించండి.
- తలసరి ఆదాయంలో ఇప్పుడు తెలంగాణ నెంబర్ వన్.
చుట్టపు చూపుగా వచ్చే నాయకులను నమ్మకండి: కేటీఆర్
- కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో..
- కోదాడ గెలుపు ఖాయం.
- విజయోత్సవ ర్యాలీల ఉంది.
- కోదాడ పట్టణంలోని పెద్ద చెరువుని అభివృద్ధి చేస్తా..
- పట్టణంలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తాం.
- కోదాడలో హైటెక్ బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చూడతాం.
- దున్నపోతుకి గడ్డి వేసి పాలు రావాలంటే సాధ్యం కాదు.
- కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదు.
- బీసీ బిడ్డను అత్యధిక మెజారిటీతో గెల్పించండి.
- డబ్బులు సంచులతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమి కొట్టాలి.
- 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది.
- 11సార్లు అవకాశం ఇస్తే చేసిన అభివృద్ధి శూన్యం.
- కాంగ్రెస్ పార్టీ హయంలో రైతులకు కరెంట్ కష్టాలు.
- ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.
- కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్న పొలాలకు కడకు వెళ్లి కరెంటు తీగ పట్టుకోండి. కరెంటు వస్తుందో లేదో తెలుస్తుంది.
- రైతులకు అండగా ఉన్నది ప్రభుత్వ కేసీఆర్ ప్రభుత్వమే.
- అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వనికేదక్కింది.
- డిసెంబర్ 3 న మళ్ళీ కోదాడ పట్టణంలో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం.
- ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న అందరికి ఐదు వేల రూపాయలు ఇస్తాం.
- 400 వందలు ఉన్న సిలిండర్‌ను మోదీ ప్రభుత్వం 1200 చేసింది.
- బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే 400వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.
ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్: కేసీఆర్
- కొడంగల్‌లో బీఆర్‌స్ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం
- పోటీలో ఉన్న అభ్యర్దుల గుణగనాలతోపాటు వారి పార్టీల విధానాన్ని చూసి ప్రజలు ఓట్లు వేయాలి.
- తంలో కొడంగల్ వాసులు ఎక్కడికెక్కడికో వలసలుపోయేవారు. ఆ పరిస్థితి నేడు మారింది.
- రేవంత్ మూడు గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నారు. అలాంటి తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దు.
- 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవడం రైతులకు సాధ్యం కాదు.
- అవి పెట్టాలంటే 50 నుంచి 60 వేల కోట్లు కావాలి.
- రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారుడు ఎన్నో భూములు కబ్జాలు చేశాడు.
మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు.
- పోలీసుల తీరుపై మండిపడ్డ శ్రీధర్ బాబు.
- శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు.
- మంథని నియోజకవర్గ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
- మంథని చౌరస్తాలో నేను ఒంటరిగా నిలబడతా.. బీఆర్ఎస్ గూండాలు వచ్చి తనను దమ్ముంటే చంపాలంటూ సవాల్..
- మహాముత్తారం మండలం మీనాజీపేటలో జరిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఘర్షణలో భాగంగా బీఆర్ఎస్ నేతలపై మంథనిలో రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన శ్రీధర్ బాబు.
ఓటేసిన హైదరాబాద్ సీపీ
- ఓటు హక్కు వినియోగించుకున్న హైదరాబాద్ నగర కోత్వాల్
- పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న సీపీ సందీప్ శాండిల్య
- హైదరాబాద్ అంబర్‌పేటలో ఓటు వినియోగించుకున్న నగర కమిషనర్
ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారు
- ఈనెల 25వ తేదీన కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం
- 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్
- 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్, హైదరాబాద్ లో రోడ్డు షో.
- 25న రాత్రి రాజ్ భవన్‌లో బస చేయనున్న మోదీ.
- ఈనెల 25వతేదీన మధ్యాహ్నం 1:25 గంటలకు బయలుదేరి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని 2:05 గంటలకు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు కామారెడ్డి సభలో పాల్గొంటారు.
- ఆ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం చేరుకుంటారు.
- సాయంత్రం 4:15 నుంచి 4:55 గంటల వరకు మహేశ్వరం లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
- అక్కడి నుంచి బయలుదేరి 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజ్ భవన్‌కు చేరుకుంటారు.
- ఆ రోజు రాజ్ భవన్‌లోనే బస చేయనున్నారు.
- 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్.
- ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.
- అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు వెళ్తారు.
- 2:15 గంటల నుంచి 2:45 వరకు దుబ్బాకలో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో మోడీ పాల్గొంటారు.
- ఆ సభ అనంతరం నిర్మల్‌కు వెళ్లనున్నారు.
- మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
- అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి బయలుదేరనున్నారు.
- 27వ తేదీన మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్, హైదరాబాద్ లో రోడ్డు షో.
- 27వ తేదీన తిరుపతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
- ఆ సభ అనంతరం నేరుగా కరీంనగర్ బయలుదేరనున్నారు.
- 2:45 గంటల నుంచి 3:25 వరకు కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
- అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్ కు చేరుకుంటారు.
- సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో మోడీ పాల్గొంటారు.
- విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది.
- రోడ్ షో అనంతరం నేరుగా హైదరాబాద్ నుంచి 6:25 గంటలకు ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
ఇందిరాపార్క్ వద్ద కర్ణాటక రైతులను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
- ధర్నా చేస్తే మీ సంగతి చూస్తామన్న కాంగ్రెస్ కార్యకర్తలు
- కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ధర్నా ఎలా చేస్తారంటూ వాగ్వాదం
తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది: రణదీప్ సుర్జేవాలా
- బీఆర్‌ఎస్‌పై గాంధీ భవన్‌లో రణదీప్ సుర్జేవాలా విమర్శలు
- తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయింది
- నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు
- 40 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు
పోలింగ్ ఏర్పాట్లపై కాసేపట్లో ఈసీ సమీక్ష
- తెలంగాణలో పోలింగ్ ఏర్పాట్లపై కాసేపట్లో ఈసీ సమీక్ష
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులతో సమావేశం
- దిశానిర్దేశం చేయనున్న సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్
కాంగ్రెస్ హామీలు అమలులో లేవు: యడ్యూరప్ప
- కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలు అమలు కావడం లేదు
- కర్ణాటక తరహాలో తెలంగాణలో గ్యారంటీ పథకాలు అంటూ కాంగ్రెస్ నేతలు వస్తున్నారు
- ఐదు గ్యారంటీలని అబద్ధపు హామీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బిసి ముఖ్యమంత్రి చేయడాన్ని స్వాగతిస్తున్నాం
- కర్ణాటక సర్కార్ దివాలా దిశగా నడుస్తోంది
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దు
సైదిరెడ్డిపై కేసేది?: ఉత్తమ్
- హుజూర్‌నగర్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు
- తన వాళ్లను కిడ్నాప్ చేశారని ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు
- పట్టించుకోవడం లేదంటూ పోలీసుల తీరుపై ఉత్తమ్ అసహనం
- కేసు నమోదు చేయలేదంటూ ఆగ్రహం
- హుజూర్‌నగర్‌లో పోలీసులు బీఆర్‌ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శ
- ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం
మోదీ హయాంలో అప్పులు, నిరుద్యోగం పెరిగాయ్: హరీష్ రావు
- తెలంగాణలో ఆర్థిక నిర్వహణపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శ
- అధ్వానంగా ఉందని కేసీఆర్ సర్కార్‌పై మండిపాటు
- నిర్మలమ్మ వ్యాఖ్యలపై స్పందించినహ హరీష్‌రావు
- ఢిల్లీలోనేమో పొగడ్తలు.. ఇక్కడికి వచ్చి విమర్శలా? అంటూ ఫైర్
- దేశంలో కేసీఆర్ ఒక్కరే రైతు పక్షపాతి
- బీజేపీ, కాంగ్రెస్‌లు రైతు వ్యతిరేక పార్టీలు
- బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు
- పంట పొలాల మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ సర్కార్‌పై కేంద్రం ఒత్తిడి
- కేంద్రం నిధులు ఇవ్వమన్నా.. కేసీఆర్ రైతుల పక్షానే నిలిచారు
- రాజస్థాన్ తరహాలోనే తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టాలని రాహుల్ గాంధీ చెప్పగలరా?
- ఆ రెండు పార్టీలకు ఓటేస్తే.. మోటార్లకు మీటర్లు బిగించడమని ఒప్పుకున్నట్లే!
- అప్పుల విషయంలో కేంద్రం కంటే తెలంగాణనే మెరుగ్గా ఉంది
- 22 రాష్ట్రాల కంటే తక్కువ అప్పే చేసింది
- మోదీ హయాంలో అప్పులతో పాటు నిరుద్యోగులు పెరిగారు
మంథని అల్లర్లపై స్పందించిన శ్రీధర్‌బాబు
- మంథని నియోజకవర్గంలో రాజకీయ ఘర్షణలపై స్పందించిన కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
- మహాముత్తారం మండలం మీనాజీపేటలో గత రాత్రి కత్తులు, కర్రలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర దాడులు
- సీబీసీఐడీ ఎంక్వైరీ వేయాలని శ్రీధర్‌బాబు డిమాండ్..
- రెచ్చగొట్టి గొడవలు సృష్టించి కాంగ్రెస్ ను బద్నాం చేసే ప్రయత్నమంటూ శ్రీధర్ బాబు ఆరోపణ
- మంథనిలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో వెంటనే మరింత బందోబస్తు పెంచి ఎన్నికల ప్రచార ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని ఈసీని కోరిన శ్రీధర్ బాబు
నేడు కేసీఆర్ బహిరంగ సభలు ఇలా..
- వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో పర్యటించనున్న సిఎం కేసీఆర్
- తాండూరు సభలో పాల్గొననున్న కేసీఆర్
- ఇటీవల మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి మృతి
- పరిగిలో హరీశ్వర్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్
నేడు టీపీసీసీ చీఫ్ ప్రచారం ఇలా..
- నేడు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- నారాయణఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
రఘునందన్ తరఫున మందకృష్ణ ప్రచారం
- నేడు సిద్దిపేట జిల్లాలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటన
- దుబ్బాకలో బీజేపీకి మద్దతుగా రోడ్ షో లో పాల్గొననున్న మందకృష్ణ
- దుబ్బాక బరిలో రఘునందన్‌రావు
నేడు సంగారెడ్డికి యడ్యూరప్ప
- నేడు సంగారెడ్డి జిల్లాకు బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప
- జహీరాబాద్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న యడ్యూరప్ప
- జహీరాబాద్ కమలం పార్టీ అభ్యర్థిగా రామచంద్ర రాజనర్సింహ
గడ్డం వివేక్ వాహనం తనిఖీ
- మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని సీసీ క్రాస్ రోడ్డు వద్ద పోలీసుల తనిఖీలు
- చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి వాహనాన్ని ఆపి మరీ తనిఖీ చేసిన పోలీసులు.
- వివేక్ కార్ తో పాటు కూడా ఉన్న వాహనాలను, మీడియా వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు.
- ఎలక్షన్ కోడ్ లో భాగంగా తనిఖీ చేశామన్న పోలీసులు.
- పోలీసుల తనిఖీలకు సహకరించిన వివేక్
- తాజాగా వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ సోదాలు
నేడు ఐదు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- నిజామాబాద్ రూరల్, నారాయణ్ ఖేడ్, గజ్వేల్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
- ఉదయం 11 గంటలకు నిజామాబాద్ రూరల్ బహిరంగసభ
- మధ్యాహ్నం 12.30 గంటలకు నారాయణ్ ఖేడ్ బహిరంగసభ
- మధ్యాహ్నం 2గంటలకు గజ్వేల్ బహిరంగసభ
- సాయంత్రం 4.30 గంటలకు కూకట్ పల్లి రోడ్ షో
- సాయంత్రం 6 గంటలకు శేరిలింగంపల్లి రోడ్ షో
నేడు మంథని బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
- నేడు మంథని బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
- నిన్న అర్ధరాత్రి మహాముత్తారం మండలం మీనాజీపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య బాహాబాహీ
- కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్న కార్యకర్తలు
- దాడికి నిరసనగా ఈ రోజు మంథని బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
- మంథనిలో హైటెన్షన్ వాతావరణం
పోలింగ్ పండుగ వాతావరణంలో జరగాలి - సీఈఓ వికాస్ రాజ్
- జిల్లా ఎన్నికల అధికారులతో సీఈఓ వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్
- జిల్లాల వారీగా రావాల్సిన రిపోర్ట్ లు త్వరగా ఇవ్వాలని ఆదేశం
- ఓటింగ్, ఫెసిలిటేషన్ రిపోర్ట్ ను రోజూ వారీగా పంపాలన్న సీఈఓ
- సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని సూచన
- 40.72 లక్షల ఓటర్ కార్డులు ప్రింట్ అవ్వగా 27లక్షలు పంపిణీ చేసినట్లు వెల్లడి
- మిగిలిన కార్డులు వచ్చే 5 రోజుల్లో పంపిణి చేయాలని ఆదేశం
- 3.6కోట్ల ఓటర్ స్లీప్ లలో 2.20 కోట్ల స్లీప్ లు పంపిణి జరిగిందని స్పష్టం
- మిగిలిన స్లీప్ ల పంపిణి ఈ నెల 23వ తేదీ వరకు పూర్తి చేయాలని కోరిన సీఈఓ వికాస్ రాజ్
- పోలింగ్ పండుగ వాతావరణంలో జరగాలి - సీఈఓ వికాస్ రాజ్
- ఓట్ల కౌంటింగ్ రోజు ఎలాంటి తప్పుడు ప్రచారం జరగకుండా కచ్చితమైన సమాచారం మీడియాకు వెనువెంటనే ఇవ్వాలని డీఈఓ-ఆర్‌ఓలకు సూచించిన సీఈఓ
- వచ్చే వారం రోజుల పాటు వర్క్ స్పీడ్ పెంచాలని ఆదేశం
రూ. 639 కోట్ల విలువైన సొమ్ము పట్టివేత
- రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న తనిఖీలు
- ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 639 కోట్ల విలువైన సొమ్ము పట్టివేత
- షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 239 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు
- రూ. 103 కోట్ల విలువచేసే అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న అధికారులు
- రూ. 35 కోట్ల విలువైన మత్తుపదార్థాలు సీజ్ చేసిన అధికారులు
- రూ. 181 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలు స్వాధీనం
- రూ.79 కోట్లు విలువ చేసే కుక్కర్లు, చీరెలు, క్రీడా సామాగ్రి స్వాధీనం
100 మంది కేసీఆర్‌లు వచ్చినా నన్నేం చేయలేరు: మల్లు భట్టి విక్రమార్క
- బండరాయిని రత్నం అనుకొని ఇన్నాళ్లూ ప్రజలు ఆయన్ను నెత్తిన పెట్టుకున్నారు
- ఇప్పుడు బండకేసి బాదడానికిసిద్ధంగా ఉన్నారు: సీఎల్పీ నేత భట్టి
- 20 సీట్లే వస్తాయనుకుంటే రాష్ట్రమంతా పర్యటనలెందుకు?
బహుజన వాదం బలపడేనా.. వినబడేనా?
- 1994 నుంచి ఉనికి చాటుకోవాలని బీఎస్పీ ప్రయత్నం
- 2014లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లోకి..
- ఈసారి మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రమంతా పోటీ
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రిముఖ పోటీలో బీఎస్పీ ఉనికి చాటే ప్రయత్నం
కేసులున్నవారే.. కానీ యోగ్యులు!
- నేరారోపణలున్న వారికి టికెట్లు ఇవ్వడంపై రాజకీయ పార్టీల వివరణ
- పార్టీకి విధేయులను ఎంపిక చేశామని బీఆర్‌ఎస్ వివరణ
- వారిపై ఉన్న కేసుల్లో పస లేదని వెల్లడి
- కార్యకర్తల అభీష్టం మేరకే ఎంపిక చేశామన్న కాంగ్రెస్ పార్టీ
- సదరు అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు కావడమే కారణమని వివరణ
- ఇంకా అభ్యర్థులపై డిక్లరేషన్ ప్రకటించని బీజేపీ
బరిలోకి బడా నేతలు
- ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అతిరథ మహారథులు
- నేడు అలంపూర్, నల్లగొండల్లో ఖర్గే పర్యటన
- 24న రాహుల్, ప్రియాంక రాక.. సోనియానూ రప్పించాలని యోచన
- ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ ఏఐసీసీ నేత
- ప్రతిరోజూ ఉండేలా టీపీసీసీ ప్లాన్