Breadcrumb
Live Updates
తెలంగాణ ఎన్నికలు-2023.. ఈరోజు అప్డేట్స్
బీజేపీ అభ్యర్థి వాహనంపై రాళ్ల దాడి
►స్టేషన్ ఘనాపూర్ బీజేపీ అభ్యర్థి విజయరామారావు వాహనంపై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి
►హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఘటన
►పెద్ద ఎత్తున ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు
►వాహనంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజయరామారావు ఫిర్యాదు
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్
►దళితులను కాంగ్రెస్ మోసం చేసిందని మోదీ అబద్ధాలు చెప్పారు: దామోదర రాజనర్సింహ
►అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్‌లను కాంగ్రెస్ గౌరవించింది
►వర్గీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు
►చిన్న రాజ్యాంగ సవరణ చేస్తే వర్గీకరణ జరుగుతుందని నాటి కమిటీ తేల్చింది
►అది చేయకుండా మళ్ళీ కమిటీ వేస్తామంటే ఎలా?
►ఎన్నికల్లో కులాలను ఎలా ఉపయోగించుకోవాలో చూస్తున్నారు?
►ఇప్పటి వరకు మీరు కులాల వారిగా ఎన్ని ఇళ్లు కట్టించారు?
అసదుద్దీన్ ఓవైసీకి రేవంత్ సవాల్
►ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయన్ని బారిష్టర్ చదివించాడు
►ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి అసదుద్దీన్ మద్దతుగా ఉంటున్నాడు
►రాజాసింగ్‌పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు?
►కేసీఆర్, మోదీ లాంటి దొంగలను కాపాడడానికి ఓవైసీ అబద్ధాలు చెపుతున్నాడు
►అసదుద్దీన్ ఓవైసీ కేసులు లాయర్ ఎవరు?
►నేను హిందువుని. నేను భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్తా
►దర్గాకి రమ్మన్నా వస్తా.. భాగ్యలక్ష్మి టెంపుల్ రమ్మన్నా వస్తా
►కర్ణాటక ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా సన్నిహితుడికి తన ఇంట్లో పార్టీ ఓవైసీ పార్టీ ఇచ్చాడు
►పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా?
►మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా?
►శుక్రవారం నేను మక్కా మసీదు వస్తా.. ఖురాన్ పట్టుకొని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా?
బీఆర్ఎస్పై రేవంత్‌రెడ్డి ఫైర్

►గువ్వల బాలరాజును కేటీఆర్ పరామర్శించి మాపై ఆరోపణలు చేశారు
►కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు
►బీఆర్ఎస్ చర్యలు సిగ్గుచేటు
►15 రోజుల్లో ప్రభుత్వంపై కుట్రలు జరగబోతున్నాయని డ్రామారావు అంటుండు
►2021లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పై దాడి ఘటన జరిగింది
►ఫలితాలు వచ్చిన తరువాత దాడిలో కుట్ర లేదని తేల్చారు.
►తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు దాడి కత్తి చేశాడు..
►గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీష్ పరుగెత్తి సురభి డ్రామాను మించి నాటకాలాడారు..
►ఈ దాడి వెనక కాంగ్రెస్ ఉందని కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసింది
►కానీ దాడిలో కుట్ర కోణం లేదని... సెన్సేషన్ కోసమే దాడి అని పోలీసులే చెప్పారు
►కేసులో అరెస్టు చేసిన ఆ యువకుడి రిమాండ్ రిపోర్ట్ ఇంత వరకు ఎందుకు బయటపెట్టలేదు?
►రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టకపోవడంలో అంతర్యమేంటి?
►హరీష్ రావుకు... దాడికి పాల్పడ్డ యువకుడి ఫోన్ సంభాషణ ఏమైనా ఉందా?
►దాడులు జరుగుతాయంటున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి
►కర్ణాటక నుంచి కూలి మనుషులను తెచ్చి కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తే ప్రజలు తిప్పికొట్టారు
►గువ్వల బాలరాజును పరామర్శ పేరుతో డ్రామారావు మరో డ్రామాకు తెర తీశారు
►కుమారస్వామి ప్రెస్ మీట్ గురించి తెలంగాణలో టీవీ ఛానళ్లు ప్రసారం చేయాలని మంత్రి హరీష్ ఛానళ్లకు ఫోన్ లు చేశారు
►ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రసారం చేయాలని చెప్పడంలో ఆంతర్యం ఏంటి?
►బీజేపీతో పొత్తులో ఉన్న కుమార స్వామి ప్రెస్ మీట్ మంత్రి హరీష్ సమన్వయం చేయడం ఏంటి?
►మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయడానికి బీఆరెస్, బీజేపీ, జేడీఎస్, ఎంఐఎం దుష్ట చతుష్టయం కుట్ర చేస్తున్నాయి
►కేటీఆర్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంది?
►రిటైర్ అయిన అధికారులపై చర్యలు చేపట్టాలని మేం ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు స్పందన లేదు.
►ఫోన్ లను హ్యాకింగ్ చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుంది.
►బీజేపీ స్పష్టంగా బీఆరెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
►కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్ వెంటనే బయటపెట్టాలి
►హరీష్ అనుచరులు, రాజు కు మధ్య ఫోన్ సంభాషణ ఏమైనా ఉంటే బయటపెట్టాలి
►మేడిగడ్డ కుంగిన ఘటనలో అసాంఘిక శక్తుల పని అని తప్పుడు కేసులుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి.
►కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్న బీఆరెస్ పై చర్యలు తీసుకోవాలి
►అందుకే కేటీఆర్ 15 రోజుల్లో కుట్ర జరగబోతుందని ప్రజలకు సంకేతాలు ఇచ్చారు
►అధికారం కోసం ఎంతటి దారుణానికి తెగబడేందుకు బీఆరెస్ సిద్ధమవుతోంది
►మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
►మోకాలికి, బోడిగుండుకు లింకుంపెట్టి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు
►తప్పుడు ప్రకటనలు చేస్తున్న కేటీఆర్ పై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?
►ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదిక ఇచ్చాయి
►డిసెంబర్ లో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే సరిపోతుంది
►డిసెంబర్ 4 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మీరు బిల్లు పెట్టాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం
►వర్గీకరణ బిల్లుకు కాంగ్రెస్ అన్ కండిషనల్ మద్దతు ఇస్తుంది
►మాదిగలను మరోసారి మోదీ మోసం చేశారు
►కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దు.. బీఆరెస్ కుట్రలను తిప్పికొట్టండి..
►బీఆర్ఎస్ నేతల్లా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై మా నాయకులు రెడ్ డైరీ లో రాసి పెడుతున్నారు.
►అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయి
►24గంటల ఉచిత విద్యుత్ పై సూటిగా సవాల్ విసురుతున్నా
►రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళదాం.. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం
►శకునం పలికే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు కేటీఆర్ వైఖరి ఉంది
►కొడంగల్‌లో నన్ను ఒడిస్తానంటున్న కేటీఆర్ ముందు సిరిసిల్లలో చూసుకోవాలి
వేములవాడలో తుల ఉమ కామెంట్స్..
- నేను పలానా పార్టీలోకి వెళ్తున్నానంటూ కొన్ని ఛానల్స్ పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి.
- నేను నా అనుచరులందరితో చర్చించాకే సమిష్ఠి నిర్ణయం తీసుకుంటా
- ఇంకా ఏపార్టీలోకి వెళ్లాలన్నది నిర్ణయించుకోలేదు
- నా నిర్ణయం నాకు, నన్ను నమ్మినవారందరికీ రాజకీయ భవిష్యత్తు ఉండేలా ఉంటుంది
- నన్ను నమ్మించి మోసం చేసిన చర్యనే మర్చిపోలేకపోతున్నా
- నమ్మడమే తప్పన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరించారు
- ఒక బీసీ మహిళను అవమానపరిచారు..
- అన్ని పార్టీల నేతలు నన్ను వచ్చి కలుస్తున్నారు
- నాకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నారు
- మరో రెండు రోజుల్లో నా రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా
- అప్పటివరకు జరిగే ప్రచారాన్ని నమ్మొద్దు
బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకున్న యువకులు
- నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని గొల్లమడ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత
- ప్రచార ర్యాలీని అడ్డుకున్న బీజేపీ యువకులు
- తోపులాటలోనే ముందుకు సాగిన బీఆర్ఎస్ రోడ్ షో
- ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన
- రైతు రుణమాఫీ, గృహలక్ష్మి పథకంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరకపోవడంతో నిరసన
హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ములుగు బీజేపీ నేత రాములు
- తెలంగాణ వచ్చాక ములుగు జిల్లా బాగా అభివృద్ధి జరిగింది
- కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న ములుగును సీఎం జిల్లా చేశారు
- ములుగు అభ్యర్థిగా నాగజ్యోతిని గెలిపించండి
- ఎవరెన్ని చెప్పినా నమ్మకండి, రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
- సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారు
- పని తక్కువ ప్రచారం ఎక్కువ సీతక్కకు
తెలంగాణభవన్‌లో మంత్రి హరీశ్‌రావు కామెంట్స్
- రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏబీవీపీ నుంచి బీఆర్ఎస్, తెలుగు దేశం ఇప్పుడు కాంగ్రెస్.. ఇలా పార్టీలు మారటమే ఆయన పని
- ఆయనకు నీతి జాతి లేదు
- పార్టీలు మారటం తప్ప ప్రజల సంక్షేమం పట్టదు
- రేవంత్ రెడ్డి ఏనాడూ తెలంగాణ కోసం రాజీనామా చేయలేదు
- ఉద్యమకారులను తుపాకులు పట్టుకొని బెదిరించాడు
- ఉద్యమ సమయంలో ఒక్కనాడు మాతో కలిసి రాలేదు
- ఉచిత కరెంట్ ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ
- కేసిఆర్ వచ్చాక భూముల విలువ పెరిగింది
- పెద్దపల్లి భూముల విలువ ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉంది గమనించాలి
- బీఆర్ఎస్లో చేరిన పలువురు పెద్దపల్లి నేతలు
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కామెంట్స్
- కర్ణాటకలో ఐదు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
- రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని చేయలేదు
- ఐదు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు
- కర్ణాటక పథకాలనే తెలంగాణలో అమలుచేస్తామంటున్నారు
- ఇక్కడ చేయలేనివారు.. తెలంగాణలో ఎలా అమలుచేస్తారు
- కాంగ్రెస్ హామీలను ఎవరూ నమ్మొద్దు
తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు కామెంట్స్
- సీతక్కకు పనితక్కువ..ప్రచారం ఎక్కువ
- ఆమె ఎక్కువ సోషల్ మీడియాలోనే ఉంటుంది
- ఈసారి ఆమె ఓటమి ఖాయం
- ఓడిపోతున్నానని తెలిసి ఇష్టం వచ్చినట్లు తిడుతోంది
- ములుగులో నాగజ్యోతిని గెలిపించండి
- సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ 100 అబద్ధాలు ఆడుతోంది
మంత్రి పువ్వాడ అజయ్‌పై తుమ్మల ఫైర్
- పువ్వాడ లోకల్ అంటున్నాడు.
- లోకల్ అయితే అక్రమంగా గుట్టలు తవ్వుకోవచ్చా?.
- సాగర్ కాలువ భూముల కబ్జా చేయొచ్చా?.
- అజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు.
- నా రాజకీయ జీవితంలో ఏనాడూ లేని కబ్జాలు, అక్రమ కేసులు ఖమ్మంలో ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయి.
- డిసెంబర్ 3న కాంగ్రెస్ విజయంతో నిజమైన దీపావళి రాబోతుంది.
అచ్చంపేట ఘటనపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
- అచ్చంపేట ఘటనపై ఈసీకి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు
- కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను అచ్చంపేట సీఐ అనుదీప్ బెదిరించిన వీడియోను ఫిర్యాదులో జత చేసిన కాంగ్రెస్.
- బీఆర్ఎస్కు సీఐ అనుదీప్ అనుకూలంగా పనిచేస్తున్నారన్న నిరంజన్
ఎంపీ కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణుల దాడి యత్నం
- నల్గొండలోని ఆర్జాలబావిలో ఉద్రిక్తత నెలకొంది.
- ఎంపీ కోమటిరెడ్డిపై దాడికి బీఆర్ఎస్ శ్రేణుల యత్నం.
- కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై దాడి చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
- కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి.
- నల్గొండ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ అశ్విని భాస్కర్‌గౌడ్ ఇంటిపై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.
- కౌన్సిలర్ అశ్వినితో పాలు ఆమె అత్తపైనా బీఆర్ఎస్ దాడి.
- ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అశ్విని
ఖమ్మంలో పువ్వాడ అజయ్ కామెంట్స్
- తండ్రి సీఎం అయితే మూడు వేల కోట్లు తీసుకొచ్చా
- కొడుకు ముఖ్యమంత్రి అయితే ఖమ్మంకు ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా
- నేను ఐ ఫోన్ అప్డేటెడ్ వెర్షన్
- తుమ్మల పాత ఐ ఫోన్..ఆ ఫోన్ మనకెందుకు
- మీకు పదవి వస్తే అహంకారం. అజయ్‌కు పదవి వస్తే ప్రజలకు అలంకారం
బీఆర్ఎస్పై ఈటల ఫైర్
- అధికార పార్టీ నాయకులు బ్రోకర్లుగా మారారు.
- గజ్వేల్‌లో భూములు గుంజుకున్నారని ప్రజలు చెబుతున్నారు.
- ధరణితో తమ భూములపై హక్కులు లేకుండా చేశారని అంటున్నారు.
- ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను దళితుల నుంచి దూరం చేశారు.
- మళ్లీ కేసీఆర్ గెలిస్తే ఉన్న ఇళ్లు కూడా లాక్కుంటారు.
- గజ్వేల్ ప్రజలను ఎవరూ కొనలేరు.
- డబ్బుల ఇస్తే తీసుకుంటారు కానీ.. కేసీఆర్‌ను ఓడించడం ఖాయం.
కాంగ్రెస్‌కు హెచ్డీ కుమారస్వామి కౌంటర్
- కాంగ్రెస్‌కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కౌంటరిచ్చారు.
- కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ గ్యారంటీ అమలు కావడం లేదు.
- తెలంగాణకు వచ్చి సిద్దరామయ్య అబద్ధాలు చెప్పారు.
- రైతులకు కరెండ్ ఎక్కడ ఇస్తున్నారో కాంగ్రెస్ చెప్పాలి.
- కర్ణాటకలో ఏ సబ్‌స్టేషన్‌కు వెళ్లి చూసినా తెలిసిపపోతుంది.
మీరు వేసే ప్రతి ఓటుకు విలువ తీసుకొస్తా: భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా:
- ఎర్రుపాలెం మండలంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం.
- తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైన రాష్ట్రంలో ప్రజల జీవనస్థితిగతులు మారలేదు.
- అధిక ఆదాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇస్తే.. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పుగా తెచ్చిన 5 లక్షల కూడా అయిపోయాయి.
- బీఆర్ఎస్ పాలకుల దోపిడీ వల్ల రాష్ట్ర సంపద ప్రజలకు అందలేదు.
- జనాభాలో సగభాగమైన మహిళలు మహాలక్ష్మి పతకం, ఉచిత బస్సు సౌకర్యం వంటి గ్యారంటీ పథకాలు ప్రకటించాము.
- ప్రజలకు రాష్ట్ర సంపద పంచే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి
- ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలని అమలు చేస్తాం.
- ప్రజల్లో మార్పు రావాలి.. సంపద పెరగాలి
- మీరు వేసి ప్రతి ఓటుకు విలువ తీసుకొస్తా
గువ్వల బాలరాజుకు మంత్రి కేటీఆర్ పరామర్శ
- బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజును పరామర్శించిన కేటీఆర్
- గత రాత్రి అచ్చంపేటలో గువ్వలపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ దాడి
- గువ్వలకు గాయాలు..జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స
- అపోలో ఆస్పత్రిలో గువ్వలను పరామర్శించిన మంత్రి కేటీఆర్
శాసనసభ ఎన్నికలకు పరిశీలకుల నియామకం
- రేపు(సోమవారం) నామినేషన్ల పరిశీలన.. 15న నామినేషన్ల ఉపసంహరణ
- శాసనసభ ఎన్నికలకు పరిశీలకుల నియామకం
- ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పరిశలకులుగా బాధ్యతలు
- 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిన ఈసీ
- 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించిన ఈసీ
- 60 మంది ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించిన ఈసీ
నా భర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
- సాక్షి టీవీతో గువ్వల బాలరాజు సతీమణి గువ్వల అమల
- నా భర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను
- ప్రచారాలు చేసుకొని ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో దాడులకు తెగబడుతున్నాడు
- ప్రచారాన్ని ముగించుకొని వెళ్తున్న సమయంలో మా వాహనాలని అడ్డగించి కార్ల అద్దాలను ధ్వంసం చేసి రాళ్లతో దాడి చేశారు
- నా భర్తకి దవడ భాగంలో, మెడ భాగంలో గాయాలయ్యాయి
- వైద్యులు ఇప్పటికే స్కానింగ్ చేశారు
- ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది
- గతంలో వంశీకృష్ణ అనుచరులు నాపై అసభ్యకరంగా మాట్లాడ్డం జరిగింది
- పోలీసులకు ఫిర్యాదులు చేసిన వాళ్ల తీరు మార్చుకోవడం లేదు
- కార్యకర్తలను బెదిరిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాల్స్ చేస్తున్నారు
- నియోజకవర్గానికి వస్తే తమ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు
- నీచమైన రాజకీయాలు సరికాదు
- అచ్చంపేట నియోజకవర్గం ప్రజలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో సహా వారి అనుచరులకు బుద్ధి చెప్తారు..
పాల్వాయి స్రవంతి చేరిక సందర్భంగా కేటీఆర్ కామెంట్స్
- రాజగోపాల్‌రెడ్డి ఎందుకు పార్టీలు మారాడనేది అర్థం కావడం లేదు
- అసలు ఆ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు
- మళ్ళీ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి ఎందుకు చేరాడు
- మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది
- తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి
- కాంగ్రెస్‌లోనే ఉంటాను అని చెప్పారు గోవర్దన్ రెడ్డి
- అలాంటి పాల్వాయి కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం
- మనుగోడు ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతి లేకపోతే ఆ ఓట్లు కూడా కాంగ్రెస్‌కు వచ్చేవి కావు
- రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు
- ఇప్పుడు భుజంపై చేతులేసుకొని తిరుగుతున్నారు
- మునుగోడులో మాతో కలిసి వచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తాం
- డబ్బు మదంతో వంద కోట్లు మళ్లీ ఖర్చు పెట్టి గెలుస్తానని రాజగోపాల్ చూస్తున్నాడు
- కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డిని ఓడించాలి
- నల్లగొండ మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య తీర్చింది కేసిఆర్
తెలంగాణ భవన్లో పాల్వాయి స్రవంతి కామెంట్స్
- చాలా ఆలోచించి బీఆర్ఎస్లో చేరాను
- గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు అని నా తండ్రి చెప్పారు
- ముందుండి నడిపిన నేతలను వెనక్కి నెట్టి ఇతరులకు అవకాశాలు ఇస్తున్నారు
- నేను పదవుల కోసం బీఆర్ఎస్లో చేరలేదు
- బీఆర్ఎస్తో మాత్రమే తెలంగాణ అభివృద్ది సాధ్యం
- నన్ను నమ్మి వచ్చిన కార్యకర్తలకు, నాకు భవిష్యత్ ఇవ్వాలని కేటీఆర్‌ను కోరుతున్నా
గులాబీ కండువా కప్పుకున్న పాల్వాయి స్రవంతి
- బీఆర్ఎస్లో చేరిన పాల్వాయి స్రవంతి
- కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
- మునుగోడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన స్రవంతి
- గతంలో మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన స్రవంతి
తిరుమలలో రేవంత్ కీలక వ్యాఖ్యలు
- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
- తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
- తెలంగాణ అభివృద్ధి చేందాలి.
- ఆంధ్ర, తెలంగాణలో మానవ సంబంధాలు, ఆర్ధిక, రాజకీయ సంబంధాలు మంచి ఉండాలని స్వామి వారిని ప్రార్ధించా..
- ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలని కోరుకున్నా..
- రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి కట్టుగా ఉండాలని ప్రార్ధించా..
- రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నా..
అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత..
- అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
- బీఆర్ఎస్ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని వెంబడించిన కాంగ్రెస్ శ్రేణులు
- అచ్చంపేటలో రాళ్లు విసురుకున్న ఇరు పార్టీల నేతలు
- ఘటనా స్థలానికి చేరుకున్న గువ్వల బాలరాజు, వంశీకృష్ణ
- రాళ్ల దాడిలో గువ్వల బాలరాజుకు గాయాలు
- బీఆర్ఎస్ నేతలకు ప్రత్యేక సెక్యూరిటీ ఇస్తున్నారని వంశీ ఆరోపణలు
- డబ్బుల సంచులను దాచిపెట్టారని కాంగ్రెస్ నేతల ఆరోపణలు
కేసీఆర్ Vs నామినేషన్స్..
- తెలంగాణలో నామినేషన్ల దాఖలు ఫైనల్ చేసిన సీఈఓ ఆఫీస్
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది 5,716 నామినేషన్లు దాఖలు
- అత్యధికంగా గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు.
- 116 నామినేషన్లతో మేడ్చల్ సెకండ్ ప్లేస్, కామారెడ్డిలో 92 మంది 104 నామినేషన్లు
- అత్యల్పంగా నారాయణపేటలో దాఖలైంది 13 మాత్రమే.. వైరా, మక్తల్‌లో 13 చొప్పున నామినేషన్లు
- కేసీఆర్ పోటీ చేసే రెండు చోట్లా రైతులు, నిరుద్యోగుల పోటీ
- చివరి రోజైన శుక్రవారం అభ్యర్థులు ఏకంగా 2,324 నామినేషన్లు దాఖలు
తెలంగాణలో తుది ఓటర్ లిస్ట్ విడుదల
- తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,18,205.
- పురుషులు.. 1,62,98,418. మహిళలు.. 1, 63,01,705.
- థర్డ్ జెండర్ ఓటర్లు 2,676, సర్వీస్ ఓటర్లు 15,406, ఓవర్సీస్ ఓటర్లు 2,944.
- జనవరిలో రిలీజ్ చేసిన ఓటర్ల జాబితాతో పోలిస్తే తాజా జాబితాలో 8.75 శాతం ఓటర్లు పెరుగుదల
- కొత్తగా 35.73 లక్షల మంది ఓటర్లను జమ చేయగా.. 9.48 లక్షల ఓటర్ల తొలగింపు
బీఆర్ఎస్ గూటికి తుల ఉమ?
- వేములవాడ రాజకీయంలో భారీ కుదుపు
- కారెక్కనున్న కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా
- తుల ఉమతో బీఆర్ఎస్ నేతల చర్చలు
- సిరిసిల్ల తెలంగాణభవన్ వేదికగా వినోద్ కుమార్ మంతనాలు
- ఉమతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం
- నేడు గులాబీ గూటిలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
- బీజేపీలో సీటు రాకపోవడంతో పార్టీ మారే ఆలోచనలో తుల ఉమ.
Related News By Category
-
అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యహహారంపై అటు అధికారం కాంగ్రెస్- ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించి...
-
జూబ్లీహిల్స్ బైపోల్.. కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్ధి దాదాపు ఖాయం అయ్యాడనుకున్న తరుణంలో.. మహమ్మద్ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీకి ఎంపిక చేసి కాంగ్రెస్ ట్విస్ట్ ఇ...
-
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఏఐసీసీ చూసుకుంటుంది: సీఎం రేవంత్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం(సెప్టెంబర్ 14వ తేదీ) జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నారు....
-
పార్టీ ఫిరాయింపులు.. దానం విషయంలో కీలక ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్.. పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీంతో, వారంతా బీఆర్...
-
‘చోటే భాయ్’ని కాపాడుతున్న ‘బడే భాయ్’.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు దాటినా కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ కా...
Related News By Tags
-
కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే సర్వే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్‌పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 119 అసెంబ్లీ ని...
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. ఎల్లుండి(డిసెంబర్ 3, ఆదివారం) తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు తెలంగాణ : లెక్కింపు కేంద్రాల ...
-
తెలంగాణలో ముగిసిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కానీ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారుల...
-
TS Elections: పలుచోట్ల ఉద్రిక్తత.. కోడ్ ఉల్లంఘిస్తున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ సీఈవో, సీని ప్రముఖులు, రాజకీయ నాయకులు...
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. ఈరోజు అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Updates.. ఈసీ సీఈఓ వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఉ.5:30 గం.లకు మాక్ పోలింగ్ రాజకీయ పార్టీల ఏజెంట్లు సమ...