Updates: సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. కులగణన తీర్మానంపై చర్చ.. అప్‌డేట్స్‌

Published Fri, Feb 16 2024 10:12 AM

Telangana Assembly Budget Session 2024 Last Day Updates - Sakshi

Telangana Assembly Budget Session 2024 Last Day Updates

తీర్మానం ఫలవంతం కావాలంటే చట్టభద్దత తేవాలి: మాజీ మంత్రి కేటీఆర్‌

  • ఓబీసీ శాఖ, జస్టిస్ సచార్ కమిషన్ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉంది.
  • మేము ప్రయత్నం చేశాం‍.. న్యాయపరమైన చిక్కులు అడ్డు వచ్చాయి\
  • మీరు ఎన్నికల్లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు కావాలంటే సభ పొడిగించి బిల్లు పెట్టండి.

మమ్మల్ని బీజేపీ బి-టీమ్‌ అంటున్నారు: అక్బరుద్దీన్‌ఓవైసీ

  • స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది.
  • ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు ఇస్తున్నాం
  • రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్‌ఎస్‌లకు సహకరించాము
  • బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లు అంటారు.
  • మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మమ్ములను బీజేపీ బి - టీమ్ అంటున్నారు.
  • అసెంబ్లీ పనితీరుపై అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం
  • 13వ తేదీ వరకు BAC పెట్టారు... తరువాత బిజినెస్ గురించి BAC పెట్టలేదు.
  •  కుల గణన పై ఎన్నికల హామీ ఇవ్వలేదు అయినా సభలో తీర్మానం చేస్తున్నారు.
  • ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తీర్మానం చేయండి. 
  • కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలి.
  •  సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగింది?
  • నేను ఈ తీర్మానంకు మద్దతు ఇస్తున్నాం కానీ క్లారిటీ, న్యాయమైన అంశాల పై జాగ్రతగా ఉండాలి.
     

సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్‌రెడ్డి

  • కులగణన తీర్మానం పై అనుమానం ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాలి.
  • తీర్మానం పై ఏదైనా లీగల్ చిక్కుల పై అంశాలు ప్రతిపక్షాలకు తెలుస్తే తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలి.
  • కులగణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుంది.
  • కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారు.
  • కడియంను తప్పుదోవ పట్టించే వాళ్ళను బయటకు పంపాల్సిందే లేదంటే గాలి సోకుతుంది.
  • ఆనాడు రిజర్వేషన్లు అయితేనే ఆయా సామాజిక నేతలు చట్ట సభల్లోకి వస్తున్నారు
  • మేనిఫెస్టోలపై ఓరోజు చర్చ పెడదాం
  • 2014, 2018, 2023లో పార్టీల మ్యానిఫెస్టో లపై ప్రత్యేకంగా చర్చిద్దాం
  • ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే మంత్రివర్గ ఆమోదంతో సభలో తీర్మానం పెడుతున్నాం.
  • ఈ పదేళ్లు మీరేం చేశారు.. ఈ 60 రోజుల్లో మీరు ఏం చేశారన్నది చర్చిద్దాం
  • సభలో తీర్మానం పెట్టింది మేమే
  • ఈ తీర్మానం.. బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే మా ఉద్దేశం
  • బాధితులుగా ఉన్నవాళ్లను పాలకులుగా చేయాలన్నదే మా ఆలోచన

కులగణనపై అనుమానాలొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

  • కులగణనపై.. ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలు
  • చట్ట సభల్లో అన్నికులాలకు న్యాయం చేసేందుకే కులగణన
  • గతంలో కాంగ్రెస్‌ హయాంలో జస్టిస్‌ కమిటీ ఏర్పాటు చేశాం
  • సమగ్ర కుటుంబ సర్వే చేశామని బీఆర్‌ఎస్‌ గొప్పగా చెప్పుకుంటుంది
  • బీఆర్‌ఎస్‌ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా?
  • ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్‌ అప్పుడు ఆ సర్వే వివరాలను వాడుకుంది
  • మాకు రాజకీయ దురుద్దేశాలు లేవు
  • కులగణనపై అనుమానాలొద్దు

ఎమ్మెల్యే  కడియం శ్రీహరి ప్రశ్నకి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం 

  • మేము మీలాగా సకల జనుల సర్వే అని చెప్పి బొంబాయి నుండి బస్సుల రమ్మని.. ఎక్కడైకైనా రమ్మని చెప్పలేదు
  • మీకున్న సందేహాలు నివృత్తి చేసే బాధ్యత మాది...
  • మాజీ మంత్రి   10 ఏళ్లుగా మంత్రిగా ఉండి  ఎమ్మెల్యే గా ఉండి అప్పుడు బలహీన వర్గాల గొంతు వినిపించలేదు కాబట్టి అపుడు చెప్పేలేదని  ఇప్పుడు చెబుతున్నారు కావొచ్చు
  • ఎవరు ఏమి చెప్పిన వింటాం..జవాబు చెబుతాం..
  • మా ప్రభుత్వం  చిత్తశుద్ది తో ఉంది.
  • మీరేమైనా సలహాలు ఇవ్వండి.. దానిపై ప్రత్యేక చర్చ చేయండి.
  •  పాత మేనిఫెస్టో లో ఉంటే చర్చ చేయండి.. 
  • మీరు 10 ఏళ్లుగా నియంత్రుత్వ ప్రభుత్వంలో  మీరు ఎం చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్పుకుంటా అంటే నడవదు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. 

  • కులగణనను మేం ఆహ్వానిస్తున్నాం
  • కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదు
  • కులగణనపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి
  • జన, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది
  • జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు
  • కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది
  •  తీర్మానంకు చట్ట బద్ధత అయిన కల్పించండి లేదంటే న్యాయ పరంగా అయినా ముందుకు వెళ్ళాలి.
  • ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదు.
  • కులగణన చేప్పట్టిన ఆయా రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు పడ్డాయి.


డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 

  •  తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగ‌ణ‌న తీర్మాణం ప్ర‌వేశ‌పెట్ట‌డం దేశ చ‌రిత్ర‌లోనే  చారిత్రాత్మ‌కం
  •  దేశంలో ఉన్న సంప‌ద‌, రాజ్యాధికారం జ‌నాభా ధ‌మాషా ప్ర‌కారం ద‌క్కాల‌ని మా పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధి గ ఆనేక సంద‌ర్భాల్లో చాలా స్ప‌ష్టంగా చెప్పారు. 
  • దేశ వ్యాప్తంగా కుల గ‌ణ‌న జరుగాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న‌ది.
  • ఎన్నిక‌ల్లో చాలా స్ప‌ష్టంగా మేము అధికారంలోకి రాగానే కుల గ‌ణ‌న చేస్తామ‌ని చెప్పాము.
  • కుల‌గ‌ణ‌న తెలంగాణ నుంచి మొద‌లు పెడ‌తామ‌ని చెప్పి క్యాబినెట్‌లో చాలా కులంకుశంగా చ‌ర్చించి నేడు అసెంబ్లీలో కుల గ‌ణ‌న‌పై తీర్మాణం పెట్ట‌డం జ‌రిగింది.
  • రాష్ట్ర వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న తో పాటు  సోష‌ల్‌, ఎకాన‌మిక్‌, ఎడ్యుకేష‌న్‌, పొల్టిక‌ల్‌, ఎంప్లాయిమెంట్ అంశాల‌పై స‌ర్వే చేయ‌డం జ‌రుగుతుంది.
  • రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి ఇంటిని, అన్ని కులాలు, ఆర్ధిక స్థితిగ‌త‌ల‌పై స‌ర్వే చేస్తాము.
  • ఈ స‌ర్వే ద్వారా సంప‌ద ఎక్క‌డ కేంద్రీకృత‌మైంది.
  • ఆ సంప‌ద‌ను అన్ని వ‌ర్గాల‌కు జ‌నాభా ద‌మాషా ప్ర‌కారం ఏలా పంచాల‌న్న‌దానిపై అన్ని ర‌కాల ప్ర‌ణాలిక‌లు త‌యారు చేస్తాము.
  • ప్ర‌తిప‌క్ష స‌భ్యులు కుల గ‌ణ‌న‌పై ఏలాంటి ఆందోల‌న గంద‌ర‌గోళం కావొద్దు.
  • సామాజిక ఆర్ధిక రాజాకీయ మార్పున‌కు పునాధిగా తెలంగాణ మార‌బోతుంది.
  • 10 సంవ‌త్స‌రాలు అధికారంలోకి ఉన్న గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం కుల గ‌ణ‌న చేయ‌లేదు.
  • ఇప్పుడు కుల గ‌ణ‌న చేయాల‌ని ఈ ప్ర‌భుత్వం తీసుకున్న మంచి కార్యాక్ర‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండ ర‌న్నింగ్ కామెంట్రీ చేయ‌డం స‌రికాదు
  • ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేస్తాం.. ఆర్థిక స్థితి గతులు కూడా సర్వే చేస్తాం
  • సర్వేలో అన్ని వివరాలు పొందుపరుస్తాం.. సర్వరోగ నివారిణిలాగా సర్వే ఉంటుంది

అసెంబ్లీలో కుల జనగణన తీర్మానంపై చర్చ

  • బీసీ కుల గణనతో బీసీలే నష్టపోతారు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల
  • 2017లోనే సమగ్ర సర్వే చేశాం.. మళ్లీ ఎందుకు?: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల

తెలంగాణ శాసన సభలో కులగణన తీర్మానం

  • బీసీ కుల గణన తీర్మానం శాసన సభలో ప్రవేశ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి @అసెంబ్లీ

  • గత ప్రభుత్వంలోనే 60 CMRF చెక్ లు పెండింగ్ లో ఉన్నాయి.
  •  పెండింగ్ ఉన్న CMRF నిదుల పై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
  • ఎన్నికలకు ముందు 1లక్ష కోట్ల శాంక్షన్స్ ఇచ్చి పోయింది.
  • గత ప్రభుత్వంలో శాంక్షన్స్ పై కీలకమైన అంశాల గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మంత్రి

  • జోన్ ల వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది
  • జోన్ ల మార్పు పై చర్చిస్తాం

సునితా లక్ష్మారెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే

  • సిరిసిల్ల జోన్ నుంచి మెదక్ ను చార్మినార్ జోన్ కు మార్చాలి.

రాజ్ ఠాకూర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • బొగ్గు గని కార్మికుల కు మెరుగైన వసతులు కల్పించాలి
  • సింగరేణి ఆసుపత్రికి తగినన్ని నిధులు వెంటనే విడుదల చేయాలి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి..

  • స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 2017 లో సైనిక్ స్కూల్ కు అనుమతి వచ్చింది..
  • దాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు తరలించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం..
  • వర్దన్న పేట ,స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల రెండు నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అవుతుంది.. దాన్ని మరో చోటు కు తరలించాలి..
  • రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణం తొలగించకూడదని ప్రభుత్వం కు విజ్ఞప్తి

జీరో అవర్ లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

  • కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరు పెట్టారు కానీ.. కల్వకుర్తి వరకు నీరు రాలేదు
  •  రైతులకు పరిహారం 40 కోట్లు పెండింగ్ ఉంది 
  • కల్వకుర్తి రైతులకు నీరు అందించాలి.. భూమి కోల్పోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలి

జీరో అవర్ లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

  • కొండగట్టు దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలి
  • లెదర్ పార్క్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి
  • నారాయణ పూర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పనులు వెంటనే పూర్తి చేయాలి

జీరో అవర్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

  • లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఊసే లేకుండా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ 80 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు
  • షాద్ నగర్ కు సాగు, తాగు నీరు రాలేదు
  • మిషన్ భగీరథ లో లీకేజీలు జరుగుతున్నాయి.. ఇష్ట రాజ్యంగా తవ్వుతున్నారు
  • డబుల్ బెడ్ రూం ఇల్లు పంపిణీ చేయకపోవడంతో కట్టిన ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయి

►తెలంగాణ శాసనసభ లో జీరో అవర్ ప్రారంభం

►ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ

  • నేడు అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేత పత్రం విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
  •  నేడు ఇరిగేషన్ పై స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నట్లు అసెంబ్లీ బిజినెస్ రూల్స్ లో ప్రస్తావన 
  •  ఇరిగేషన్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం
  •  నేడు ఇరిగేషన్ చర్చలో ప్రధాన అస్త్రంగా మారనున్న కాగ్ రిపోర్ట్


ప్రధాన అస్త్రంగా..

  •  గురువారం నాటి సభలో కాగ్ రిపోర్టును పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
  •  కాగ్ రిపోర్టులో సైతం కాళేశ్వరం పై అనేక ఆరోపణలు
  •  కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు ప్రస్తావించిన కాగ్
  •  ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు


నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు

  • తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ఆఖరి రోజు నేడు

మాజీ మంత్రి హరీష్ చిట్ చాట్

  • అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ ఈ రోజు ప్రజాభవన్ కు వెళ్తానన్నారు
  • రోజూ ప్రజాభవన్ కు వెళ్తానని చెప్పిన సీఎం తొలి రోజు మాత్రమే వెళ్లారు.
  • ఇదే అంశాన్ని మొన్న అసెంబ్లీలో మేము ఆధారాలతో సహా నిలదీశాం.
  • దీంతో ఈ రోజు హడావుడిగా కేవలం అరగంట ముందు సమాచారం ఇచ్చి అసెంబ్లీకి వెళ్లారు.
  • సీఎం ప్రజాభవన్ కు వస్తారని నిన్ననే సమాచారం ఇస్తే ఈ రోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లేవారు

Advertisement
Advertisement