చిత్తూరు జిల్లాలో టీడీపీ హైడ్రామా 

TDP Leaders Hydrama In Chittoor District - Sakshi

కవ్వింపులు.. గొడవలు

పోలీసుల జోక్యంతో సద్దు మణిగిన వివాదం 

మదనపల్లె టౌన్‌(చిత్తూరు జిల్లా): మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శుక్రవారం నామినేషన్ల పరిశీలనకు హాజరైన టీడీపీ శ్రేణులు కవ్వింపులకు పాల్పడ్డాయి. రెబల్స్‌ను రెచ్చగొట్టి, వెనకాల నామినేషన్లు తిరస్కరించారని గొడవకు దిగి డ్రామా లాడాయి. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని కొండామారిపల్లె, రామాచార్లపల్లె పంచాయతీల సర్పంచ్‌ పదవులకు టీడీపీ రెబల్‌ అభ్యర్థులుగా సరస్వతి, ఉమామహేశ్వరి, చెడే పుష్ప రెండు రోజుల క్రితం నామినేషన్లను దాఖలు చేశా రు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా కొండామారిపల్లె పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఉమామహేశ్వరి గ్రామానికి ఆశా వర్కర్‌గా పనిచేస్తోందంటూ, ఆ పదవికి రాజీనామా చేయలేదని సరస్వతి వర్గీయులు ఆ ర్వోను నిలదీయడంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. (చదవండి: నిమ్మగడ్డకు ఆ అధికారం ఎక్కడిది?)

అదే అదనుగా టీడీపీ వర్గీయులు అక్కడే ఉన్న ఓ రెబల్‌ అభ్యర్థిని రెచ్చ గొట్టి వెనకాల డ్రామా నడుపుతూ కవ్వింపులకు పాల్పడ్డారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాల మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సాయంత్రం రామాచార్లపల్లె గ్రామానికి టీడీపీ తరఫున సర్పంచ్‌ అభ్యర్థి గా నామినేషన్‌ దాఖలు చేసిన చెడే పుష్ప వర్గీయు లు సర్టిఫికెట్లను సమర్పించడానికి ఆర్వో వద్దకు వస్తుండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. నామినేషన్లు వేయడం నిన్నటితో ముగిసిందని ఇప్పు డు పత్రాలు తీసుకెళ్లి ఇవ్వడం ఏమిటని? తాము ఒప్పుకునేది లేదని గ్రామస్తులు కొందరు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎట్టకేలకు గొడవ సద్దు మణిగింది.(చదవండి: టీడీపీ ఆఫర్‌: నామినేషన్‌ వేస్తే రూ.2 లక్షలు!

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top