కోడెల శివరాం వల్ల బాగా నష్టపోయాం: టీడీపీ నేత పమిడి బాలకృష్ణ

TDP Leader Pamidi Balakrishna Comments On Kodela Sivaram - Sakshi

సాక్షి, గుంటూరు: కోడెల శివప్రసాద్‌ కొడుకు కోడెల శివరాం గత ఐదేళ్లలో కష్టపడి పని చేసిన పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని టీడీపీ నేత పమిడి బాలకృష్ణ సంచలన వ్యాఖలు చేశారు. నకరికల్లు మండలం కల్లకుంటలో రేపు(గురువారం) కోడెల విగ్రహావిష్కరణకు వచ్చే చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా జోక్యం చేసుకోవాలన్నారు. తమ దగ్గర నుంచి కోడెల శివరాం రూ.32 లక్షలు తీసుకున్నారని మండిపడ్డారు. ఆ డబ్బులు తిరిగి మాకు చంద్రబాబునాయుడు, లోకేష్‌, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.

30ఏళ్ల నుంచి పార్టీకి ఎంతో ఖర్చు పెట్టి అంకితభావంతో పని చేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో నీరు-చెట్టు పనులు చేస్తున్న తమని కోడెల శివరాం బాగా ఇబ్బంది పెట్టారని చెప్పారు. కోడెల శివరాం వల్ల తాము బాగా నష్టపోయామని, తమచేత ఖాళీ పేపర్ల పైన సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. పార్టీకి నష్టం చేసిన కోడెల శివరాం మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోడెల శివరాం ధన దాహం వల్ల నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు నష్టపోయారని బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ నేత పమిడి బాలకృష్ణ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top