ఆప్ నేత సంజయ్ సింగ్‌కు చుక్కెదురు

Sanjay Singh Not Allowed To Oath As MP By Rajya Sabha Chairman - Sakshi

ఢిల్లీ: ఆప్ నేత సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేయడానికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ నిరాకరించారు. సంజయ్ సింగ్ వ‍్యవహారం ప్రివిలేజెస్ కమిటీ వద్ద ఉందని ధంఖర్ తెలిపారు. సంజయ్‌ సింగ్‌పై ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కేసును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ విచారిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్‌ను రాజ్యసభ ఎంపీగా ఆప్ మరోసారి నామినేట్ చేసింది. సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్, చార్టర్డ్ అకౌంటెంట్ నరైన్ దాస్ గుప్తాను రాజ్యసభకు నామినేట్ చేశారు.

రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు, ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏడు రోజుల మధ్యంతర బెయిల్‌ను కోరుతూ సంజయ్ సింగ్ ఫిబ్రవరి 1న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే.. పార్లమెంటుకు ప్రమాణం చేయడానికి మాత్రమే కోర్టు అనుమతినిచ్చింది. 

మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌ను గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. డిసెంబర్ 22, 2023న బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత జనవరి 3న ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా.. కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. బయటకు వస్తే కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపింది. 

ఇదీ చదవండి: రసవత్తరంగా జార్ఖండ్‌ రాజకీయం.. సోరెన్‌ సర్కార్‌కు బలపరీక్ష

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top