యూపీలో రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. యోగితో పూజా పాల్‌ భేటీ | Samajwadi Party Pooja Pal Meets CM Yogi Adityanath | Sakshi
Sakshi News home page

యూపీలో రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌.. యోగితో పూజా పాల్‌ భేటీ

Aug 17 2025 1:36 PM | Updated on Aug 17 2025 1:36 PM

Samajwadi Party Pooja Pal Meets CM Yogi Adityanath

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమాజ్‌వాద్‌ పార్టీ(ఎస్పీ) నుంచి బహిష్కరణ ఎదుర్కొన్న ఎమ్మెల్యే పూజా పాల్‌ తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. లక్నోలోని సీఎం నివాసంలో యోగితో ఆమె భేటీ అయ్యారు. దీంతో, ఆమె బీజేపీలో చేరుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. ఇటీవల యూపీ అసెంబ్లీలో ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్‌.. బీజేపీ ప్రభుత్వం, సీఎం యోగి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో ఇటీవల విజన్ డాక్యుమెంట్‌ 2047పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూజా పాల్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. యూపీలో నేరగాళ్లపై యోగి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. నేరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపే చూస్తోందన్నారు. తన భర్త (బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్‌) హత్య కేసులో నిందితుడు అతీక్‌ అహ్మద్‌ ఆగడాలపై చర్యలు తీసుకోవడంతో తనకు న్యాయం జరిగిందన్నారు. దీంతో, అసెంబ్లీలో బీజేపీ నేతలు కూడా ఆమె వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలను సమాజ్‌వాజ్‌ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సీరియస్‌గా తీసుకున్నారు. పూజా వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ సందర్భంగా అఖిలేష్‌.. పూజా పాల్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డరని పేర్కొన్నారు. అనంతరం, ఆమెపై వేటు వేశారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ఆమె చర్యలు పార్టీకి నష్టం కలిగించారని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె.. సీఎం యోగిని కలవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement