‘అహం పెరిగింది.. అందుకే రాముడు అలా చేశాడు’ | RSS Indresh Kumar Comments On BJP Arrogance Results | Sakshi
Sakshi News home page

బీజేపీ 241: ‘అహం పెరిగింది.. అందుకే రాముడు అలా చేశాడు’

Published Fri, Jun 14 2024 11:49 AM | Last Updated on Fri, Jun 14 2024 12:59 PM

RSS Indresh Kumar Comments On BJP Arrogance Results

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు పెట్టుకుంది. కానీ, గురి తప్పింది. అయితే ఆరెస్సెస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అహం పెరిగిపోవడం వల్లే ఎన్నికల్లో అలాంటి ఫలితం వచ్చిందంటూ వ్యాఖ్యానించారాయన.

జైపూర్‌(రాజస్థాన్‌) కనోటాలో గురువారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాముడ్ని పూజించేవాళ్లలో అహం పెరిగిపోయింది. వాళ్లు తమను తాము అతిపెద్ద పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ, చివరికి ఏం జరిగింది. వాళ్లు అనుకున్నది జరగలేదు. రాముడు కూడా వాళ్లను 241 దగ్గరే ఆపేశాడు’’ అని అన్నారాయన. అలాగే.. ప్రతిపక్ష ఇండియాకూటమిని కూడా ఆయన వదల్లేదు. 

కూటమి పేరును కూడా  ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారాయన. ‘‘ఎవరైతే రాముడి మీద విశ్వాసం లేకుండా పోయారో.. వాళ్లను కూడా 234 దగ్గరే ఆయన ఆపేశాడు’’ అని కామెంట్‌ చేశారు.

ఇదిలా ఉంటే..  గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా మెజారిటీ(272) కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో మాత్రం విఫలమైంది. కేవలం 241 సీట్లతో మిత్రపక్షాల మీద ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే.. మొన్నీమధ్యే ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సైతం ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. నిజమైన సేవకుడు ఎప్పుడూ చేసిన సేవను చెప్పుకోడు, ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement