
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నామినేసన్ల పరిశీలన ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 4,798 మంది అభ్యర్థులు మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. పరిశీలన అనంతరం 3,307 సెట్ల నామినేషన్లను స్వీకరించగా, మరో 772 సెట్ల నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన సెట్ల పరిశీలకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి వరకు ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయలేదు. ఈ నెల 15తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది.
– ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 73 నామినేషన్లను తిరస్కరించారు. నాగార్జునసాగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి.. ప్రపోజర్స్ సంతకాలు సరిపడా చేయించకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలుచేసిన మోత్కుపల్లి నర్సింహులు అఫిడవిట్ అందజేయకపోవడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.
– ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలుచేసిన పలువురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment