వైఎస్సార్‌సీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి | Pulivendula Tdp Leader Satish Reddy Joined Ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి

Published Fri, Mar 1 2024 5:52 PM | Last Updated on Tue, Mar 26 2024 1:00 PM

Pulivendula Tdp Leader Satish Reddy Joined Ysrcp - Sakshi

సాక్షి, తాడేపల్లి:  పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు.

‘‘నాతో వైఎస్సార్‌సీపీ నేతలు టచ్‌లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు. ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు. చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది. ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది. సీనియర్లకు గౌరవం లేదు. టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారింది. వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నా మీద ఎంతో ప్రేమ చూపించారు’’ అని సతీష్‌రెడ్డి చెప్పారు.

ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది. సీఎం జగన్ ఏం చెబితే అదే చేస్తా’’ అని సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement