‘ప్రధాని మోదీ మతం పేరుతో ఓట్లు ఎందుకు అడగాలి?’ | Priyanka Gandhi questions PM Why ask for votes on basis of mangalsutra religion | Sakshi
Sakshi News home page

‘ప్రధాని మోదీ మతం పేరుతో ఓట్లు ఎందుకు అడగాలి?’

May 19 2024 7:58 AM | Updated on May 19 2024 7:58 AM

Priyanka Gandhi questions PM Why ask for votes on basis of mangalsutra religion

కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ నియామక ప్రక్రియి మూలంగా చాలా మంది అభ్యర్థులు తమ విశ్వాన్ని కోల్పోతున్నారు. ద్రవ్యోల్బణం, ధరలు పెరిగాయి...

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీపై మరోసారి  తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ మంగళసూత్రం, మతం, గేదెలు పేరుతో ఎందుకు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ఆమె శనివారం  ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.  

‘‘ప్రధాని మోదీ గత పదేళ్లలో తన పాలనపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటే.. పాలన పేరుతోనే  ప్రజలను ఓట్లు అడగాలి. 45 ఏళ్లలో ఎన్నడూ చూడని  విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. పదేళ్లలో చేసిన  పని చెప్పి ఓట్లు అడగాలి. కానీ, మోదీ  ఎందుకు అలా కాకుండా మతం, మంగళసూత్రం, గేదెల పేరుతో ఓట్లు అడుగుతున్నారు?. 

కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ నియామక ప్రక్రియి మూలంగా చాలా మంది అభ్యర్థులు తమ విశ్వాన్ని కోల్పోతున్నారు. ద్రవ్యోల్బణం, ధరలు పెరిగాయి. మహిళలు ఐదు నిత్యావసర వస్తులు కొందామని షాప్‌కు వెళ్లితే.. కేవలం రెండు వస్తువులు కొనుగోలు చేసి తిరిగి వస్తుంది. 

ధరల పెరుగుదల మహిళల్లో తీవ్ర నిరాశ నింపుతోంది.  ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌ అనే నినాదాన్ని  ఇచ్చి.. పదేళ్ల అవుతోంది. మరీ అలాంటప్పుడు ఈ పదేళ్లలో ఎందుకు అభివృద్ధి  చేయలేకపోయారు. ఉజ్వల్ ఎల్‌పీజీ స్కీమ్‌, ఊపీఏ-ఎరా స్కీమ్‌ వంటికి ఎందుకు అభివృద్ధి చేయలేదు?’’  అని  ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.

లోక్‌సభఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు ఆదాయన్ని చొరబాటుదారులకు పంపిణీ చేస్తుందిని, మహిళల మంగళసూత్రాలు సైతం లాక్కుంటారని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ప్రియాంకా గాంధీ.. దేశం కోసం తన తల్లి సోనియా గాంధీ మంగళసుత్రాన్ని త్యాగం చేసిందని కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement