బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్‌ నోటీసులు

privilege Notices Against BRS Rajya Sabha MPS - Sakshi

సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీలోపు సమాధానం చెప్పాలని రాజ్యసభ చైర్మన్‌ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు సభలో రూల్స్‌కు విరుద్ధంగా ఫ్లకార్డులు ప్రదర్శించారని బీజేపీ ఎంపీ(బీహార్‌) వివేక్‌ ఠాకూర్‌ రాజ్యసభ చైర్మన్‌(ఉపరాష్ట్రపతి) జగదీప్‌ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తదుపరి చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీలకు నోటీసులు జారీ అయ్యాయి. సీనియర్‌ నేతలు కే.కేశవరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డిలతో పాటు వడ్డీరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్‌, దామోదర్‌ రావులు నోటీసులు అందుకున్నవాళ్లలో ఉన్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top