ప్రధాని మోదీ లక్ష్యం అదే.. ఉత్తరాఖండ్ సీఎం | PM Modi Confidence in Strength of BJP Say Pushkar Singh Dhami | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ లక్ష్యం అదే.. ఉత్తరాఖండ్ సీఎం

Apr 6 2024 9:08 PM | Updated on Apr 6 2024 9:08 PM

PM Modi Confidence in Strength of BJP Say Pushkar Singh Dhami - Sakshi

ఉత్తరాఖండ్: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుపొందాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగానే అభ్యర్థులు కూడా అడుగులు వేస్తున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 'పుష్కర్ సింగ్ ధామి' దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ ప్రజలపైన విశ్వాసం ఉండటం వల్ల 400 సీట్లకు గెలుస్తామని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని పుష్కర్ సింగ్ అన్నారు. మీ కృషి, అంకితభావం బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మార్చాయని అన్నారు. 2014, 2019 కంటే ఈసారి బీజేపీని మరింత పెద్ద విజయాన్ని సాధించేలా ప్రతిజ్ఞ చేయాలని పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు.

ప్రధాని మోదీని మూడవసారి అధికారంలోకి తీసుకురావడానికి మన వంతు సహకారం అందించాలని, అందుకు రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాలను మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని ధామి అన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక సంచిక కూడా విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement